[njwa_button id="1872"]

[njwa_button id="1872"]
Categories: NewsPolitics

Pawan Kalyan : డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పిఠాపురంలో పవన్.. అడుగు పెట్టగానే పవన్ చేసిన ఫస్ట్ పని అదే

Pawan Kalyan : ఏపీలో ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా షురూ అయ్యాయి. ఎన్నికలు పూర్తయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏపీలో ఎక్కువగా వినిపించిన పేరు పవన్ కళ్యాణ్. ఆయన పేరు మాత్రం మారుమోగిపోయింది. పిఠాపురం అనే పేరు ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్. ఆయన పిఠాపురం ఎమ్మెల్యే అయ్యాక తొలిసారి ఇవాళ ఫించన్ కార్యక్రమానికి పిఠాపురం వచ్చారు.

Advertisement

పిఠాపురానికి తొలిసారి పవన్ డిప్యూటీ సీఎం హోదాలో రావడంతో పోలీసులు పిఠాపురంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక ఫించన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా అన్నారు.గత ప్రభుత్వాన్ని మొన్నటి దాకా తిట్టుకున్నాం.. విమర్శించాం. ఇప్పుడు చాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిస్ అయితే చేశామో.. ఆ ప్రామిస్ ను నిలబెట్టుకోవాలి. మేము వస్తే ఫించన్ విధానాన్ని రద్దు చేస్తామని గత ప్రభుత్వం విమర్శించింది కానీ.. మేము దాన్ని ఇంకా పెంచి ఇచ్చాం అన్నారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan : రిషికొండలో రూ.600 కోట్లతో ప్యాలెస్ అవసరమా?

సంక్షేమ పథకాలు చాలా ముఖ్యం. వాటితో పాటు అభివృద్ధి కూడా కావాలి. పంచాయతీ రాజ్ శాఖ లెక్కలు చూస్తుంటే అడ్డగోలుగా నిధులు ఎటు వెళ్లాయో అర్థం కావడం లేదు. ఒక చిన్న రిజర్వాయర్ కోసం, కాలువ మరమ్మతు కోసం కోట్లకు కోట్లు తరలించారు. 600 కోట్లతో రిషికొండలో ప్యాలెస్ కట్టారు. ఆ 600 కోట్లు ఖర్చుపెడితే ఒక జిల్లా బాగుపడేది. పంచాయతీ రాజ్ వ్యవస్థను నడిపే వ్యక్తిగా చెబుతున్నా. నా వైపు నుంచి అవినీతి ఉండదు. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం. ఏ కాలుష్యం ఎందుకు ఉంది. పారిశ్రామికంగా ఏం చేయాలి.. అనేది ఖచ్చితంగా చేస్తామన్నారు.

ఎక్కడా తాగడానికి నీళ్లు లేవు. కేంద్రం నుంచి జల్ జీవన్ మిషన్ కు నిధుల కొరత లేదు. కానీ.. గత ప్రభుత్వం చేయలేకపోయింది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి కోసం కేంద్రం నిధులు ఇస్తుంది. మ్యాచింగ్ గ్రాంట్ ను కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ను ఇవ్వలేకపోయారు కానీ.. రిషికొండలో మాత్రం వందల కోట్లు పెట్టి బిల్డింగ్ లు కట్టారు.. అని పవన్ చెప్పుకొచ్చారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి : కొత్త‌గా వ్యాపారం పెట్టుకునేవాళ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 25 ల‌క్ష‌ల లోన్‌, 35 శాతం సబ్సిడీ..!

Author

Latest Telugu News Desk

Recent Posts

Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!!

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…

11 months ago

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

2 years ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

2 years ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

2 years ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

2 years ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

2 years ago