[njwa_button id="1872"]
[njwa_button id="1872"]
Nitish kumar Reddy : టీమిండియాని ఫ్యూచర్‌లో ఏలేది నితీష్ కుమార్ రెడ్డి.. హార్ధిక్‌కి పెద్ద ఎసరు పెట్టేలా ఉన్నాడు..!
Nitish kumar Reddy : ఐపీఎల్ IPL 2024 మ్యాచ్‌లతో అనేక ఆణిముత్యాలు బయటకి వస్తున్నాయి. మన తెలుగు కుర్రాళ్లు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే తిలక్ వర్మ మంచి పేరు ప్రఖ్యాతలు అందుకోగా, ఇప్పుడు మరో తెలుగు Telugu కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవల ఐపీఎల్ 2024లో హైదరాబాద్ వేదికగా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మ్యాచ్ ఒకటి జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ sunrisers hyderabad ఒక్క పరుగు తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్స్ భువనేశ్వర్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించారు. తెలుగు కుర్రాడు తన బ్యాటింగ్, బౌలింగ్‌తో దేశం మొత్తాన్ని ఊపేశాడు.
ఈ వైజాగ్ కుర్రాడు రాజస్తాన్ రాయల్స్ rajasthan royals బౌలర్లను ఊచకోత కోసాడు. 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు . నితీష్‌ను ఐపీఎల్ 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. గతేడాది కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన నితీష్ రెడ్డికి తన టాలెంట్ చూపించే అవకాశం రాలేదు. కాని ఈ సీజన్‌లో ప్యాట్ కమిన్స్ మనోడి సత్తా చూసి బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి పంపించాడు. దీంతో ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్ తరపున ఆడిన నితీష్ కుమార్ రెడ్డి… గత రంజీ ట్రోఫీలో మొత్తం 366 పరుగులు చేసి, 25 వికెట్లు తీశాడు. కాగా, నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ స్కిల్స్‌ను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.
హార్ధిక్ hardik pandya కి ఇతను రీప్లేస్‌మెంట్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ముందు ముందు మ్యాచుల్లో కూడా ఇలానే సత్తా చాటాలని తెలుగు అభిమానులు కోరుకుంటున్నారు. ఆల్ రౌండ్ స్కిల్స్ ఉన్న ఆటగాళ్లకు టీమిండియాలో మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి అతడు టీమిండియాలో తప్పక స్థానం సంపాదించుకుంటాడని, ఫ్యూచర్ స్టార్‌గా కూడా మారతాడని కొందరు క్రీడా పండితులు చెప్పుకొస్తున్నారు
Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
This website uses cookies.