Krishi Bhagya Scheme : రైతు సోదరులకు శుభవార్త. తాజాగా కర్ణాటక ప్రభుత్వం వారి వ్యవసాయ వార్షిక వర్షపాతంపై ఆధారపడి ఉన్న రైతుల కోసం కృషి భాగ్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఎక్కువ శాతం వ్యవసాయ భూమి వర్షాధారం పైనే ఆధారపడి ఉండటం వలన పొడి భూములలో వ్యవసాయ కార్యకలాపాలు అస్థిర వర్షపాతం సమయంలో సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యవసాయానికి సాగునీరు అందే విధంగా కృషి భాగ్య పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే జిల్లాలోని తాలూకాలో వర్షాధార ప్రాంతాలలో లక్ష మందికి పైగా రైతులకు ప్రభుత్వం దాదాపు రూ.968.37 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది.
ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం వ్యవసాయ రంగంలో విప్లవత్మక మార్పులను తీసుకురావడం. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా పొలంలో వర్షపు నీటి సంరక్షణ పద్ధతులను అవలంబించనన్నారు . అదేవిధంగా ఈ పథకం ద్వారా రైతులు నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించే దిశగా ప్రోత్సాహం అందించనున్నారు.
అయితే ఈ పథకాన్ని సగటున వర్షపాతం 450 మిల్లీమీటర్ల నుండి 850 మిల్లీమీటర్ల మధ్య ఉన్న వ్యవసాయ వాతావరణ మండలాలలో అమలు చేస్తారు. అనంతరం ఈ పథకం ఏడాదికి 45 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అమలు చేయబడుతూ వస్తుంది. ఇక ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది లక్ష మందికి పైగా రైతులు ప్రయోజనం పొందగలుగుతారు.ఇక ఈ పథకం ద్వారా రైతులు వర్షపు నీటిని రక్షించుకోవడానికి సరైన సదుపాయాలను నిర్మించుకోవడానికి మరియు నీటి సమస్య ఏర్పడినప్పుడు ఆ నీటిని బయటకు తీయడానికి లిఫ్ట్ పంపులు డీజిల్ మోటర్లు కొనుగోలుకు నగదు పొందవచ్చు. అలాగే తక్కువ నీటిని ఎక్కువ పంటలకు వినియోగించే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాజెక్టులో పొందుపరచనున్నారు.
ఇక ఈ పథకంలో కృషి హోమ్ అనేది వర్షపు నీటిని సేకరించెందుకు తవ్విన ఒక పెద్ద గొయ్యి. ఇక ఇది వేసవికాలంలో దాదాపు 5 ఎకరాల భూమికి సాగునీరును అందించడానికి ఎంతగానో సహాయపడుతుంది. కావున ఈ కృషి హోమ్ ను నిర్మించుకోవడానికి అవసరమయ్యే నిధులను మీరు పథకం ద్వారా పొందవచ్చు. ఇక ఈ పథకం ద్వారా ప్రయోజనాలను పొందాలంటే వ్యవసాయ శాఖ ప్రకారం 1 ఎకరం లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రైతులు వ్యవసాయ శాఖ లేదా రైత స్వకాస్ కేంద్రాలను సంప్రదించాల్సి ఉంటుంది.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.