[njwa_button id="1872"]
[njwa_button id="1872"]
Bhuma Akhila Priya : కుటుంబమే వ్యతిరేక వర్గం.. భూమా అఖిల ప్రియకు అగ్నిపరీక్ష..!
Bhuma Akhila Priya : కర్నూలు రాజకీయాల్లో భూమా Bhuma Akhila Priya కుటుంబందే పెత్తనం. దశాబ్దాల కాలంగా కర్నూలు రాజకీయాలను శాసిస్తోంది భూమా కుటుంబమే. భూమా నాగిరెడ్డి దంపతులు ఉన్నంత కాలం కర్నూలులో వారిదే పెత్తనం. ఇక ఆళ్లగడ్డలో భూమాను ఓడించే వారే లేరు అనేంతగా ఉండేది. కానీ ఎప్పుడైతే భూమా దంపతులు చనిపోయారో అప్పటి నుంచే ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఇక నాగిరెడ్డి వారసురాలిగా ఆయన పెద్ద కూతురు అఖిల ప్రియ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబు ఆమెకు ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టారు. కానీ ఏం లాభం.. 2019 ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు.
అప్పటి నుంచి అఖిల ప్రియ Bhuma Akhila Priya నిత్యం ఏదో ఒక వివాదంలో ఉంటూ వస్తున్నారు. అప్పట్లో కిడ్నాప్ ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు ఆమెపై చాలానే వచ్చాయి. చాలా వివాదాలు ఆమెను చుట్టు ముట్టినా సరే చంద్రబాబు మాత్రం ఆమెకే టికెట్ కేటాయించారు. చంద్రబాబు టికెట్ ఇవ్వడమే పెద్ద విజయంగా ఆమె భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆమెకు సొంత కుటుంబీకులే ప్రత్యర్థులుగా మారారు. నాగిరెడ్డి అన్న కొడుకు కిషోర్ రెడ్డి గత వారం క్రితమే వైసీపీలో చేరాడు. వాస్తవానికి ఆయన బీజేపీ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా వైసీపీలో చేరాడు.
దాంతో ఇప్పుడు వైసీపీ బలంగా మారిందని అంటున్నారు. ఆళ్లగడ్డలో ఇప్పుడు వైసీపీకి కిషోర్ రాకతో బలం పెరిగిందని.. తామే గెలుస్తామని ప్రచారం మొదలు పెట్టారు. ఇలాంటి సమయంలో భూమా కుటుంబీకులు, భూమా వర్గం కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. కుటుంబీకుల్లో చాలామంది ఇప్పుడు అఖిల్ ప్రియకు Bhuma Akhila Priya వ్యతిరేకంగా ఉన్నారు. వారంతా ఆ మధ్య మీటింగ్ పెట్టుకుని అఖిల్ ప్రియకు టికెట్ ఇవ్వొద్దని చంద్రబాబుకు లేఖ రాశారు. ఇటు టీడీపీ కేడర్ కూడా ఆమెను వ్యతిరేకించింది. అయినా సరే చంద్రబాబు మాత్రం మొదటి లిస్టులోనే ఆమెకు టికెట్ కేటాయించారు.
కానీ ఇప్పుడు గెలుపు అవకాశాలు మాత్రం తగ్గిపోయాయని అంటున్నారు. ఎందుకంటే ఇటు సొంత కుటుంబం వ్యతిరేకంగా మారడంతో పాటు ఆమెకు అత్యంత సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డితో కూడా గొడవలు వచ్చాయంట. ఆయన ఇప్పుడు సహకరించే పరిస్థితి లేదని అంటున్నారు. ఇలా ఎటు చూసుకున్నా ఆమెకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షే అంటున్నారు.
Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
This website uses cookies.