[njwa_button id="1872"]
[njwa_button id="1872"]
Allu Arjun : బన్నీ మైనపు విగ్రహంపై నోరు మెదపని చిరు, పవన్.. విబేధాలున్నాయా..?
Allu Arjun : మెగా కాంపౌండ్ లో అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్టు వార్ నడుస్తోందనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దానికి ఎన్నో ఘటనలు ఉదాహరణగా నిలిచాయి. అలాంటిది ఇప్పటి వరకు ఈ విబేదాలపై ఎన్నడూ నేరుగా ఎవరూ స్పందించలేదు. కానీ సమయానుకూలంగా అవి ఎప్పటికప్పుడు బయటపడుతూనే వస్తున్నాయి. అప్పట్లో బన్నీ బర్త్ డేకు చరణ్ స్పందంచలేదు. కానీ అదే రోజు అఖిల్ బర్త్ డే అయితే మాత్రం ఘనంగా విషెస్ చెప్పాడు. అటు బన్నీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నప్పుడు కూడా ఏదో తూతూ మంత్రంగానే చరణ్ విషెస్ చెప్పాడు.
ఇక పవన్ కల్యాణ్ అయితే తనకు తెలియదన్నట్టే మౌనంగా ఉండిపోయాడు. ఇలా ఎప్పటికప్పుడు మెగా వర్సెస్ అల్లు వార్ అనేది కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని నెలకొల్పారు. ఇంతకు ముందు ఈ మ్యూజియంలో ప్రభాస్, మహేశ్ బాబు విగ్రహాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు వారిద్దరి తర్వాత ఆ ఘనతను అల్లు అర్జున్ కూడా అందుకున్నాడు. నిన్న ఆయన స్వయంగా తన చేతుల మీదుగా ఈ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. అచ్చం చూడటానికి అల్లు అర్జున్ లాగే ఉంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలను బన్నీ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఘనంగా పోస్టు చేశాడు. అయితే బన్నీ ఇంత రేర్ ఫీట్ అందుకుంటే అటు మెగా కాంపౌండ్ నుంచి స్పందన మాత్రం కరువైంది. రామ్ చరణ్ అయితే ఈ విషయం తనకు తెలియదన్నట్టే మౌనంగా ఉండిపోయాడు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే చిరంజీవి కూడా తన మేనల్లుడు ఇంత ఘనత సాధించినా పట్టించుకోనట్టు మౌనంగా ఉండిపోయాడు.
మెగా ఫ్యామిలీలో కీలకంగా ఉండే చిరు, చరణ్ ఇలా మౌనంగా ఉండటంతో వీరి మధ్య విబేధాలు ఇంకా ఉన్నాయనే టాక్ నడుస్తోంది.ఇక పవన్ కల్యాణ్ అయితే అటు రాజకీయాలు, సినిమాలు అంటూ బిజీగా ఉంటున్నాడు. కానీ చరణ్ బర్త్ డే రోజు స్పెషల్ పోస్టు పెట్టిన పవన్.. బన్నీ మైనపు విగ్రహంపై మాట్లాడలేదు. అటు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్ లు మాత్రం కొద్దో గొప్పో విషెస్ చెప్పి చేతులు దులుపుకున్నారు.
Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
This website uses cookies.