Flour : మనం ఉన్న ఈ ఆధునిక కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. దీనితో చాలా మంది ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే. ఆహార విషయాలలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. తమ ఆహారాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవటానికి వివిధ రకాల ఎంపికలను కూడా పాటిస్తున్నారు. గోధుమ పిండి కాకుండా ఇప్పుడు చాలా మంది జొన్నలు, మినుములు, రాగులు విటిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ సందర్భంలో మరొక మంచి ఎంపిక కూడా చేరింది. అదే కొబ్బరి పొడి. మీరు గోధుమ పిండితో చేసిన రొట్టెలను చూసి ఉండవచ్చు.
కానీ మీరు ఎప్పుడైనా కొబ్బరి పిండితో చేసిన రొట్టెలు రుచి చూశారా. లేదు కదా. మస్త్ గా ఉంటాయి. అంతేకాక ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని తెలిపారు. కొబ్బరి పిండి, గోధుమ పిండికి గ్లూటెన్ రహిత ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందుతుంది. కొబ్బరి పిండితో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. కొబ్బరి పిండి మీకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొబ్బరి పిండిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ సరైన జీర్ణక్రియను నిర్వహించడంలో ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం,తిమ్మిరి లాంటి కడుపు సమస్యలను తగ్గించడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది…
బరువు తగ్గాలి అని అనుకునేవారికి కొబ్బరి పిండి కూడా ప్రయోజనంగా ఉంటుంది. దీనిలో తక్కువ మోతాదులో కేలరీలు మరియు కొవ్వులు ఉంటాయి. అలాగే అధిక మోతాదులో ఫైబర్ అనేది ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీలింగ్ అనేది ఇస్తుంది. ఇక ఆహారం తినాలి అనే కోరికను కూడా తగ్గిస్తుంది…
కొబ్బరి పిండిలో గ్లైసోమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అనగా అకస్మాత్తుగా రక్తంలో చక్కేర స్థాయి అనేది పెంచదు. మధుమేహ రోగులకు కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తుంది…
కొబ్బరి పిండిలో ఉండే లారీక్ యాసిడ్ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించటంలో మరియు మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో ఎంతో మేలు చేస్తుంది. దీనితో గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది…
కొబ్బరి పిండి మిడియం చైన్ ట్రైగ్లీజరైడ్ మంచి మూలం. MCT లు తొందరగా శరీరం శోషించబడతాయి. అంతేకాక తక్షణ శక్తిని కూడా ఇస్తుంది…
వీటన్నిటితో పాటు కొబ్బరి పిండితో శరీరానికి కావలసినటువంటి పోషకాహారం పూర్తిగా వస్తుంది. నుము,మెగ్నీషియం, పొటాషియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా దీనిలో ఉన్నాయి. కావున మీరు తదుపరి రుచికరమైన, ఆరోగ్యకరమైన ఏదైనా తయారు చేయాలి అని అనుకుంటే, కొబ్బరి పిండిని ప్రయత్నించండి. అయితే దీర్ఘకాల వ్యాధులతో పలు సమస్యలతో బాధపడేవారు మాత్రం వైద్యులను కచ్చితంగా సంప్రదించటం మంచిది…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.