Earaches : ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలో చెవి నొప్పి వేధిస్తూ ఉంటుంది. ఇవి తరచుగా బ్యాక్టీరియా మరియు వైరస్ మరియు శిలీంద్రాలు అనేవి చెవిలో ఉండటం వలన ఈ నొప్పి వస్తుంది. ఈ నొప్పి అనేది పిల్లలలో ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే. జలుబు, అలర్జీ, ధూమపానం వంటి పరిస్థితుల కారణం వలన కూడా చెవి నొప్పి అనేది వస్తుంది. ఇది సాధారణంగా దాని అంతట అదే మళ్లీ నయం అవుతుంది. చెవిలో ఇన్ఫెక్షన్ అనేది ముదిరిన్నప్పుడే దీనికి మందులు అనేవి అవసరం. దీని కోసం కొన్ని ఇంటి చిట్కాలు ఎంతో హెల్ప్ చేస్తాయి. అవి ఏమిటో ఇప్పుడుచూద్దాం.
చెవి నొప్పి నుండి తొందరగా ఉపశమనం పొందటానికి కోల్డ్ కంప్రెసర్ ఉపయోగించవచ్చు. దీనిని వాడటం వలన ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ఎవరైనా దీనిని వాడొచ్చు.
చెవి నొప్పి తొందరగా తగ్గటానికి పది నిమిషాల పాటు కోల్డ్ హాట్ కంప్రెస్ వాడవచ్చు. ఈ చిట్కాలు కారణాన్ని బట్టి పనిచేస్తాయి. వీటిని ట్రై చేసే ముందు వైద్యులని సంప్రదించడం చాలా మంచిది. దీనిని వాడిన తర్వాత కూడా చెవి నొప్పి అనేది తగ్గకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించటం మంచిది.
చెవి నొప్పికి పచ్చి అల్లం ఎంతో పవర్ ఫుల్. దీనిని ఈజీ ఇంటి చిట్కాగా కూడా ఉపయోగించవచ్చు. దీనిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు చెవి నొప్పి తగ్గేందుకు, ఇన్ఫెక్షన్స్ కి వ్యతిరేకంగా పోరాడటానికి, చెవిలో మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి చిరాకును కూడా తొలగిస్తుంది.
ఎలా వాడాలి : అల్లం రసం అనేది చెవి నొప్పి నివారణగా చెప్పొచ్చు. ఒక ముక్క పచ్చి అల్లం తీసుకొని దానిని తురుముకోవాలి. తర్వాత దాని నుండి రసాన్ని తీసి చెవిలో రెండు చుక్కలు వేసుకోవాలి. ఈ రసాన్ని చెవి నొప్పులకు పైపూతగా రాయండి.
టీట్రీ ఆయిల్ : టి ట్రీ ఆయిల్ అనేది ఒక ప్రత్యేకమైన ఆయిల్. ఇది సహజ నివారణగా కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ లో ఎంతో పవర్ ఫుల్ అయినా యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాక్ట్ ఇన్ఫ్లమెంటరీ, హిలింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది చెవి నొప్పి మరియు చెవి ఇన్ఫెక్షన్ కు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
ఎలా వాడాలి : ఈ ఆయిల్ ను హెర్బల్ స్టోర్స్ ఆన్ లైన్ లో తీసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ను కలుపుకొని గొంతు మరియు చెవిలో ఒకటి లేక రెండు చుక్కలు వేసుకోవాలి..
ఆలివ్ ఆయిల్ : ఈ ఆయిల్ చెవి నొప్పికి దివ్య ఔషధం. దీని వాడకం కూడా చాలా మంచిది. కానీ అమెరికన్ అకాడమీ ఆఫ్ పిరియాట్రిక్స్ ప్రకారం చూస్తే, ఈ ఆలీవ్ ఆయిల్ చెవి నొప్పికి చెక్ పెట్టొచ్చు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే. ఇది పిల్లల చెవిలో వేసే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం..
ఎలా వాడాలి : ఒక టీ స్పూన్ ఆలీవ్ ఆయిల్ వేసి దానిని వేడి చేసి చల్లారిన తర్వాత చెవిలో వేసుకోవాలి..
లవంగాలు : లవంగాలను కూడా చెవి నొప్పి నివారణగా వాడవచ్చు. ఇది అనాల్జేసిక్, యాంటీ ఇన్ ఫ్లమెంటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇవి చెవి నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. లోపల చెవి ఇన్ఫెక్షన్స్ కి కూడా ట్రీట్మెంట్ చేసేందుకు దీన్ని ఉపయోగించవచ్చు..
ఎలా వాడాలి : లవంగాలను చెవి నొప్పికి మంచి మందుగా ఉపయోగిస్తారు. లవంగం, నువ్వుల నూనె కలిపి వేడి చేయాలి. ఇది చల్లారిన తర్వాత అనగా గోరువెచ్చగా అయ్యాక చెవిలో వేసుకోవాలి. ఇది చెవి నొప్పి తగ్గటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి రిజల్ట్ కోసం మీరు దీనిని మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా మూడు నాలుగు సార్లు ట్రై చేయండి.
తులసి : తులసి ఆకులు అనేవి ఆయుర్వేదం ఎఫెక్టివ్ గా చెవి నొప్పి తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. ఈ ఆకు రసంలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్, ఇమ్యూనిటీని పెంచె గుణాలు కూడా ఉన్నాయి. ఇన్ఫెక్షన్ ని దూరం చేసి చెవి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది..
ఎలా వాడాలి : కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని మెత్తగా పేస్టులా చేసి దాని నుండి రసాన్ని తీయాలి. ఆ రసాన్ని నొప్పి ఉన్న చోట ఒకటి లేక రెండు చుక్కలు వేయాలి. ఇలా రెండు రోజులు వాడిన తర్వాత కూడా నొప్పి అనేది తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించండి.
వెల్లుల్లి : వెల్లుల్లి అనేది చెవి ఇన్ఫెక్షన్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
దీనిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇయర్ కెనాల్, చుట్టుపక్కల వాపును కూడా తగ్గించి బ్లాక్ అయినటువంటి చెవిని కూడా క్లియర్ చేయగలదు.
ఎలా వాడాలి : చెవి నొప్పి తగ్గేందుకు వెల్లుల్లి రెబ్బలను ఓ రెండు నమిలి మింగాలి. లేక పోతే పొడిలా చేసుకుని కూడా తీసుకోవచ్చు. అంతేకాక వెల్లుల్లి కొద్దిగా వేడి చేసి, చిటికెడు ఉప్పు వేసి పేస్టులా చేసుకుని పేస్ట్ ను కొంచెం చెవి దగ్గర రాయాలి…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.