Sprouted Wheat : మొలకెత్తిన గోధుమలు తీసుకోవడం వలన ఆరోగ్యనికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. మొలకెత్తిన ధాన్యాలలో ఎన్నో మంచి పోషకాలు ఉన్నాయి. మొలకలు అనేవి ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఇవి ప్రోటీన్ కు మంచి మూలం అని చెప్పొచ్చు. అంతేకాక వీటితో ఎన్నో తీవ్రమైన వ్యాధి సమస్యల ను తగ్గించటంలో కూడా ఇది దివ్య ఔషధం లాగా పని చేస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా సరే మొలకెత్తినటువంటి గోధుమలను తిన్నారా. మొలకెత్తిన గోధుమల వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం….
మొలకెత్తినటువంటి గోధుమలను తినడం వలన జీర్ణ క్రియకు సంబంధించిన సమస్యల నుండి కూడా ఎంతో ఉపసమనం కలిగిస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ A, B, C లు మొలకెత్తిన గోధుమలలో ఉన్నాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరచడంలో ఎంతో బాగా సహాయం చేస్తుంది..
మొలకెత్తిన గోధుమలను రోజు ఆహారంలో భాగం చేసుకుంటే ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ను ఇస్తుంది. ఎందుకు అంటే. మొలకెత్తిన గోధుమలు తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ అనేది బాగా పెరుగుతుంది. దీంతో ఎక్కువ తినకుండా కూడా ఉంటారు. ఇది బరువును నియంత్రించడానికి ఎంతో మేలు చేస్తుంది…..
పోషకాలు పుష్కలం : మొలకెత్తిన గోధుమలో పోషకాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి. దీనితో మన శరీర పని తీరు అనేది ఎంతో మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే. దీనిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ అనేది అధికంగా ఉన్నాయి. అందువల్ల మన డైట్ లో మొలకెత్తిన గోధుమలను ఏదో ఒక విధంగా చేర్చుకోవడం చాలా మంచిది..
మధుమేహం బాధితులకు మంచిది : డయాబెటిక్ రోగులకు మొలకెత్తిన గోధుమలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది డయాబెటిక్ రోగులకు సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. అంతే మొలకెత్తిన గోధుమలు తినడం వలన మన శరీరానికి కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్,జింక్ లాంటివి లభించడంతో పాటు పోషకాలు కూడా అందుతాయి. జీర్ణ క్రియ సైతం ఎంత మెరుగుపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లు, విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి..
ఎముకలకు బలం : మొలకెత్తిన గోధుమలు తినడం వల్ల ఎముకలు కూడా ఎంతో బలంగా తయారవుతాయి. ఎందుకు అంటే. దీనిలో అధిక శాతం కాల్షియం అనేది ఉంటుంది. ఇది ఎముకలను బలోపెతం చేసేందుకు సహాయం చేస్తుంది. మొలకెత్తిన గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వలన ఎముకలు ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా కూడా తయారవుతాయి..
మొలకెత్తిన గోధుమలను ఎలా తయారు చేసుకోవాలంటే : దీని కోసం ముందుగా గోధుమలను శుభ్రంగా కడిగి రాత్రి టైంలో నానబెట్టాలి. ఉదయం లేవగానే ఆ నీటిని మార్చాలి. మార్చిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఒక గుడ్డ లేక మొలకెత్తేటటువంటి డబ్బాలో గాలి వచ్చేలాగా చూసుకొని సుమారుగా 12 గంటల పాటు వాటిని పక్కన పెట్టాలి. ఆ మరుసటి రోజు గింజలకు మొలకలు అనేవి వస్తాయి..
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.