YS Sharmila : ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినా రాజకీయాలు మాత్రం అటు వైఎస్ షర్మిల, ఇటు వైఎస్ జగన్ మధ్య నడుస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాగూ ఏం చేయలేదు. కనీసం ప్రతిపక్షంలో ఉండి అయినా ప్రజల సమస్యలపై పోరాడాలంటూ వైఎస్ జగన్ పై పలువురు ఫైర్ అవుతున్నారు. తాజాగా.. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. మరోసారి అన్న వైఎస్ జగన్ పై ఫైర్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ముకాసినట్టు ఉందా? అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనబడుతున్నారు.. అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికీ, ప్రజల తరుపున ప్రతి క్షణం ఆలోచించే వారి కోసం పనిచేసే వారికి మధ్య తేడా ఉంటుంది షర్మిల గారూ.. మీ మాటలు చూస్తే జగన్ గారి మీద ద్వేషమే తప్పితే ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదంటూ షర్మిలపై వైసీపీ ట్విట్టర్ లో రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే.
ఆ ట్వీట్ పై స్పందించిన షర్మిల రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో నన్ను కించపరిచేంత ద్వేషం మీకు ఉంది. మాకు ద్వేషం లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉంది. అది అధికార పార్టీనా? లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు. కాబట్టే తప్పు అన్నాం. చట్ట సభను గౌరవించకపోవడం తప్పు. కాబట్టే రాజీనామా చేయమన్నాం.. అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.