Allu Arjun : ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి వార్ పక్కకు పోయి ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు వార్ తెరమీదకు వచ్చింది. అసలు రాజకీయాల్లో పోటీ చేయని వ్యక్తుల మధ్య ఇప్పుడు వార్ మొదలైంది. మొన్నటి వరకు ఏపీ రాజకీయాల్లో కేవలం రాజకీయ పార్టీల మధ్యనే విమర్శలు, ప్రతి విమర్శల యుద్ధం నడిచింది. అయితే ఇప్పుడు సడెన్ అల్లు వర్సెస్ మెగా వార్ మొదలైంది. దీనికి కారణం బన్నీ చేసిన పని. అల్లు అర్జున్న ఇప్పటి వరకు ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. కేవలం సినిమాలు చేసుకునేవాడు. అయితే తాజాగా ఆయన శనివారం నాడు తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లాడు.
తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఆయన ఇంటికి మద్దతు ఇచ్చాడు. శిల్పా రవి ఇప్పుడు నంద్యాల నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు. శిల్పా రవి చంద్రారెడ్డికి ఓటేసి గెలిపించాలంటూ బన్నీ కోరాడు. ఇదే ఇప్పుడు పెను వివాదాన్ని రాజేసింది. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఇప్పుడు జనసేన అధినేతగా ఉన్నాడు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. మెగా హీరోలు అందరూ వచ్చి పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కు ఓటేయాలంటూ కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయలేదు.
మొన్న ఓ ట్వీట్ పెట్టి వదిలేశాడు. అంతే తప్ప పవన్ కల్యాణ్ ను ఇప్పటి వరకు కలిసింది లేదు సపోర్ట్ చేసింది లేదు. మెగా ఫ్యామిలీ అండతో ఎదిగిన బన్నీ ఇప్పుడు పవన్ కల్యాణ్ ను పట్టించుకోవట్లేదని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఒక స్నేహితుడి కోసం పవన్ కల్యాణ్ కు బద్ద శత్రువు లాంటి వైసీపీకి ఓటేయాలని ఎలా చెబుతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్నేహితుడి కోసం అడగకుండానే ఇంటికి వెళ్లిన బన్నీ.. ఇటు సొంత మామ అయిన పవన్ కల్యాణ్ కోసం పిఠాపురంకు ఎందుకు వెళ్లలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు.
అయితే అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. అల్లు అర్జున్ తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పాడని.. కేవలం స్నేహితుడి కోసమే వెళ్లాడు కానీ.. వైసీపీతో ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నారు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.