Gajuwaka : ఏపీలో కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకమైన ఫోకస్ ఉంది. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలు, వారి చరిత్ర ఇంకా చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల ఆయా నియోజకవర్గాలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అలాంటి వాటిల్లో గాజువాక నియోజకవర్గం కూడా ఒకటి. ఈ నియోజకవర్గం ఎందుకు ఫేమస్ అంటే.. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసి దాదాపు 17వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి ఈ సారి వైసీపీ తరఫున గుడివాడ అమర్ నాథ్, టీడీపీ తరఫున పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు.
అయితే ఈ ఇద్దరికి ఇంకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే 1989లో పెందుర్తిలో అంతర్భాగంగా ఉన్న గాజువాక నియోజకవర్గం అంతర్భాగంగా ఉండేది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గుడివాడ గురునాథరావు, టీడీపీ నుంచి పల్లా సింహాచలం పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో సింహాచలం ఓడిపోయి గురునాథ రావు గెలిచారు. అప్పుడు తండ్రులు పోటీ పడితే.. ఇప్పుడు గురునాథ రావు కొడుకు అమర్ నాథ్ మంత్రి హోదాలో ఉండి పోటీ చేస్తున్నారు. ఇక అప్పుడు తన తండ్రి ఓడిపోయినందుకు ఈసారి తాను బలమైన పోటీ ఇచ్చి ఓడించాలని చూస్తున్నారు పల్లా శ్రీనివాస రావు.
అయితే వీరిద్దరూ కూడా బలమైన సామాజికవర్గానికి చెందిన వారే. ఆర్థికంగానూ ఇద్దరూ చాలా బలంగా ఉన్నారు. అందుకే ఈ ఇద్దరి నడుమ పోటీ ఢీ అంటే ఢీఅన్నట్టే సాగిపోయింది. కాగా పోల్ మేనేజ్ మెంట్ లో వైసీపీ ముందంజలో ఉందని చెబుతున్నారు. కానీ టీడీపీకి కాపు ఓట్లు బలంగా పడ్డాయని అంటున్నారు. రెండు వర్గాలు టీడీపీకి బలంగా ఓటు వేశాయి కాబట్టి శ్రీనివాసరావు గెలుపు ఖాయమే అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గాజువాకలో ఓడిపోతే గనక టీడీపీకి కాపుల్లో పట్టు పెరిగినట్టే అని భావించాలని చూస్తున్నారు. కాపు నేతల బలం ఆ పార్టీకి పెరిగినట్టే.
కాగా అమర్ నాథ్ గెలిస్తే మాత్రం వైసీపీకి ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి ఎవరు గెలుస్తారనేది.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.