Land Titling Act : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా ఎన్నికల జోరు హోరా హోరిగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలన్నీ కూడా గెలిపే లక్ష్యంగా ప్రచారాలను చేపడుతూ ముందుకు సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ చట్టం గనుక అమలులోకి వస్తే భూములన్నీ కూడా పోతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అధికార పార్టీ వైసీపీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో భూ యజమానులకు మరింత భరోసా లభిస్తుందని చెప్పుకొస్తున్నారు. అయితే అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అంటే ఏంటి…?ఈ చట్టం అమల్లోకి తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ కు , అవసరమా..?ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ భూమితో పాటు వ్యవసాయేతర భూమి చాలా మొత్తంలో ఉంది. ఇక వాటన్నింటికీ సంబంధించి 30కి పైగా రికార్డులు కూడా ఉన్నాయి. ఆ రికార్డులు అన్నీ కూడా ఎప్పుడో బ్రిటిష్ కాలానికి చెందినవి. అయితే ఆంధ్రప్రదేశ్ లో భూ వివాదాలు చోటు చేసుకున్నప్పుడు 90 శాతం మంది ప్రజలు వాటిని స్థానికంగానే పెద్దమనుషుల సమక్షంలో పరిష్కరించుకుంటారు. ఎందుకంటే భూ వివాదాల కేసులపై కోర్టుకు వెళ్లినట్లయితే కొన్నేళ్లపాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఆలోపు ఈ భూమి ఎవరికి లేకుండా పోయే అవకాశం కూడా ఉంది. అందుకే కోర్టుకు వెళ్లడం కంటే స్థానికంగానే ప్రజలు వీటిని పరిష్కరించుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో భూముల యొక్క కేసులు ఏళ్ల తరబడి సాగేందుకు గల ముఖ్య కారణం అక్కడ సరైన రికార్డులు లేకపోవడమని చెప్పాలి. అలాగే ఉన్న రికార్డులు కూడా తప్పులు తడకగా ఉండటం ముఖ్య కారణం.
ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో భూమి చుట్టూ చాలా ఉన్నాయి. అయితే ఈ సమస్యలను పరిష్కరించి భూ యజమానికి ఆ భూమిపై పక్కా యాజమాన్యపు హక్కు కల్పించి వారి వారసులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడమే ఇలాంటి టైటిలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఎంత భూమి సాగు అవుతుంది. వ్యవసాయేతర భూమి ఎంత ఉంది అది ఎవరి ఆధీనంలో ఉంది అనే విషయాలను కూడా టైటిల్ రిజిస్టర్ లో నమోదు చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం రికార్డులో ఉన్న భూమి మన పేరు మీద ఉన్నప్పటికీ వేరే వ్యక్తి వచ్చిఈ భూమి తమది అని కోర్టులో కేసు వేసే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు రాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూ యజమానులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఎవరు పడితే వారు ఈ భూమి నాది అంటూ యజమానులపై కేసులు వేసే అవకాశం ఇకపై కనిపించదు.
ఈ చట్టం ద్వారా భూముల లెక్కలు తేల్చి ఎలాంటి వివాదాలు లేకుండా భూములను టైటిల్ రిజిస్టర్ లో నమోదు చేస్తారు. వివాదాల్లో ఉన్నటువంటి భూములను ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేస్తారు. ఇక ఆ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో మరియు రాష్ట్రస్థాయిలో ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఇక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఒక్కసారి భూ యజమానిని నిర్ధారిస్తే ఇక అదే ఫైనల్ అవుతుంది. కాబట్టి చాలామంది ఆంధ్రప్రదేశ్ లో ఈ చట్టం అమలులోకి వస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరికొందరు దీనిపై ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ చట్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.