KTR : విద్యార్థులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాంధీ సన్నాసా.. లేక రేవంత్ రెడ్డి సన్నాసా. విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. నిన్న పోలీసుల దాడిలో గాయపడిన బీఆర్ఎస్వీ నాయకులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా వాళ్లకు కేటీఆర్ ధైర్యం చెప్పారు.
మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 6 వేల అదనపు పోస్టులు వేసి విద్యార్థులను, నిరుద్యోగులను దగా చేస్తున్నాడని మండిపడ్డారు. విద్యార్థులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లను డైరీలో రాస్తున్నారని.. అధికారంలోకి వచ్చాక అస్సలు వదిలిపెట్టం అన్నారు. ప్రజలపై దాడులు చేయడమే ప్రజా పాలనా అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా వీరోచితంగా ప్రభుత్వాన్ని, తప్పు చేస్తున్న పోలీసులను ప్రశ్నించిన బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుల పోరాట పటిమను కేటీఆర్ ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పోరాట పటిమను చాలా సార్లు చూపించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 పిలవాలని, డీఎస్పీ వాయిదా వేయాలని మీరు నిరసనలు తెలిపారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతూనే ఉండాలంటూ కేటీఆర్ సూచించారు. ఎప్పుడూ పార్టీ అగ్ర నాయకత్వం బీఆర్ఎస్వీ నాయకులకు అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.