Chittibabu : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ నాగబాబు తన ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో చర్చనియాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల నాగబాబు “మాతో ఉంటూ పరాయి వాళ్లకి పనిచేసేవాడు మావాడు అయినా పరాయి వాడే.. మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే” అని క్యాప్షన్ రాస్తూ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో నాగబాబు చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసినట్లుగా పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయగా మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ ప్రచారాలు చేస్తూ పవన్ కు మద్దతుగా నిలిచారు. అయితే ఇక్కడ బన్నీ మాత్రమే ఎవరు ఊహించని విధంగా నంద్యాల వెళ్లి తన స్నేహితుడు తరఫున ప్రచారాలు చేశారు.
దీంతో అల్లు అర్జున్ ని ఉద్దేశించే నాగబాబు ఈ విధంగా కామెంట్స్ చేసి ఉంటారని పలువురు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన చిట్టిబాబు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగబాబు ఈ విధంగా తన ట్విట్టర్లో షేర్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని తెలిపారు. బన్నీ తన ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తాడని మనందరికీ తెలుసు. అంతేకాక తాను ఒక స్నేహితుడి కోసం మాత్రమే అక్కడకి వెళ్లినట్లు చెప్పారు. దీనిని రాజకీయపరంగా చూడడం మంచిది కాదంటూ తెలిపారు. ఇక సైలెంట్ గా ఉన్న దానిని ఉండనివ్వకుండా నాగబాబు కావాలని ఈ విధంగా పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదంటూ తెలిపారు.
అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక స్టార్ హోదాలో ఉన్న వ్యక్తి అని ఒక మెచ్యూర్ పర్సన్ తాను వ్యక్తిగతంగా ఎవరికి సపోర్ట్ చేయాలనేది తన నిర్ణయమని తెలిపారు. దానిని మీరు తప్పుపడుతూ ఈ విధంగా కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదని చిట్టిబాబు తెలియజేశారు. అలా అనుకుంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ , నాగబాబు తల్లిని చంద్రబాబు ఘోరంగా అవమానించాడు. అలాంటి వాడితో ఇప్పుడు మీరు పొత్తు పెట్టుకున్నారు. రాజకీయంగా మీరు చేసింది కరెక్ట్ అయినప్పుడు బన్నీ చేయింది కూడా అలాగే చూడాలి కదా అంటూ చిట్టిబాబు ప్రశ్నించారు. ఏది ఏమైనప్పటికీ నాగబాబు చేసింది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.