Chandrababu : ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గత 5 ఏళ్లలో నాశనం అయిన ఏపీని గాడిన పెట్టడం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ అభివృద్ధి కోసం ఏం చేయాలో అన్నీ చేసేస్తున్నారు. ఏ విషయంలోనూ అలసత్వం ప్రదర్శించడం లేదు. తాజాగా అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంగా ఉన్న ఎన్టీఆర్ భవన్ లో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే.. నేను మళ్లీ వాళ్ల కాళ్లకు దండం పెడతా. ఈరోజు నుంచి నా కాళ్లకు ఎవ్వరూ దండం పెట్టొద్దు. ఆ విధానానికి స్వస్తి పలుకుతున్నా. కావాలంటే మీ పేరెంట్స్ కి, దేవుడి కాళ్లకు దండం పెట్టండి.. అంతే కానీ నాయకుల కాళ్లకు కాదు అంటూ స్పష్టం చేశారు.
రాజకీయ నాయకుల కాళ్లకు దండం పెట్టి మీ గౌరవాన్ని అస్సలు తగ్గించుకోకండి. పార్టీ శ్రేణులందరికీ నేను పిలుపునిస్తున్నా.. ఈ రోజు నుంచి ఏ నాయకుడి కాళ్లకు దండం పెట్టొద్దు. ప్రజలకు కూడా నా విన్నపం అదే. నా నుంచే ఈ సంస్కృతిని ప్రారంభిస్తున్నా.. అని చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత ప్రజలు, కార్యకర్తల నుంచి పలు వినతి పత్రాలను చంద్రబాబు స్వీకరించి.. వాళ్ల సమస్యలను తీర్చుతానని హామీ ఇచ్చారు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.