Ysrcp : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న ఆంధ్రప్రదేశ్‌లో ఒకే విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగగా.. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది, 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ చేసారు. ఏపీలో ఆరు గంటల వరకు దాదాపు 81.86 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఈసారి ఏపీలో పోలింగ్ పెరిగిందనే చెప్పాలి. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేసిన వారి శాతం 80.66 శాతంగా తేల్చారు. ఇది కాకుండా పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బంది వేసిన బ్యాలెట్ ఓట్లు దీనికి అదనంగా చెబుతున్నారు. 2019 కంటే 2 శాతం పెరిగింది.
ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత గెలుపెవరిదనే విషయం ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ వైసీపీ గెలుస్తుందని కొందరు, ప్రతిపక్ష టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుస్తుందని కొందరు భావిస్తున్నారు.ఆరా సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఏపీ ఎన్నికలపై ఆరా సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేసింది. ఆరా అంచనా ప్రకారం ఏపీలో గెలిచేది ఓడేది వీళ్లే..! నర్సాపురం, అనకాపల్లి నుంచి బీజేపీ అభ్యర్థులు గెలుపు, పురంధేశ్వరి రాజమండ్రిలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు, గెలుపుకి ఓటమికి సమాన అవకాశాలు ఉన్నాయి, రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి, విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరి మంచి మెజార్టీతో గెలవబోతున్నారు.
కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ గెలవబోతున్నారు, విశాఖపట్నం నార్త్ లో విష్ణుకుమార్ రాజు గెలిచే అవకాశం, జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్ స్థానాల్లో పోటీ చేయగా.. 2 పార్లమెంట్ స్థానాల్లో గెలవబోతోంది, పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి గెలవబోతున్నారు . తెలుగుదేశం పార్టీ పరంగా చూస్తే చంద్రబాబు కుప్పంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. నారా లోకేశ్ మంగళరిలో గెలవబోతున్నారు. హిందూపురంలో బాలకృష్ణ మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఇక ఓటమి విషయం చూస్తే.. మంత్రి సీదిరి అప్పలరాజు పలాసలో ఓటమి,
శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు, మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాకలో ఓటమి చవిచూడబోతున్నారు.
కారుమూరి నాగేశ్వరరావు తణుకులో ఓటమి చవిచూడబోతున్నారు. చెల్లబోయిన వేణుగోపాల్ రాజమండ్రి రూరల్ లో ఓటమి చవిచూడబోతున్నారు.. మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలో ఓటమి చవిచూడనున్నారు… మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో గట్టి పోటీ ఎదుర్కోనబోతున్నారు. విడదల రజిని గుంటూరు వెస్ట్ లో స్వల్ప తేడాతో ఓటమి చవి చూసే అవకాశం.. ఆదిమూలపు సురేశ్ కొండెపిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూసే అవకాశం.. ఉషశ్రీ చరణ్ పెనుకొండలో అతి స్వల్ప తేడాతో ఓటమి చవిచూసే అవకాశం. గుమ్మనూరు జయరాం గుంతకల్లులో ఓటమి చవిచూసే అవకాశం. మంత్రి ఆర్కే రోజా నగరిలో ఓటమి చవిచూడబోతున్నారు. నెల్లూరు లోక్ సభ స్థానంలో విజయసాయిరెడ్డి ఓటమి చవిచూడబోతున్నారు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.