YS Jagan : ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేనతోనే కాదు చిన్నగా తమ బలం పెంచుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ నుంచి కూడా వైఎస్ జగన్ కు షాక్ తగిలేలా ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా అన్న జగన్ మీద షర్మిల సంధిస్తున్న మాటల బాణాలు డైరెక్ట్ గా ఆ పార్టీ శ్రేణుల్లో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. ఓ పక్క అధికారం చేపట్టిన కూటమి ప్రజా పాలన దిశగా ప్రజల సంకేషం కోసం చూస్తుంది. ఐతే ఏపీలో గత పదేళ్లుగా లేని కాంగ్రెస్ హడావిడి ఇప్పుడు కనిపిస్తుంది.జగన్ ఓడడం ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిలని నియమించడం ఈ రెండిటి వల్ల అక్కడ పెద్ద మార్పులు వచ్చాయి.
ఐతే ఇప్పటికీ వైసీపీ సెంట్రల్ లో ఎన్.డీ.ఏ కే సపోర్ట్ అందిస్తుంది. ఇది వైసీపీ ఫాలోవర్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తుంది. ఓ పక్క డైరెక్ట్ గా టీడీపీ, జనసేనతో కలిసి ఏపీలో కూటమిగా ఏర్పడి వైసీపీని గద్దె దించితే అదే బీజేపీని పట్టుకుని జగన్ ఉన్నాడు.వైఎస్ జగన్ చేస్తే బీజేపీకి చేయాలి లేదంటే ఒంటరిగా ఉండాలి. అంతేకానీ ఇండియా కూటమికి సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఐతే బీజేపీకి ని కూడా కాదని సొంత వాయిస్ వినిపిస్తేనే ప్రజల్లో తమ బలం పెరుగుతుందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు.
లాస్ట్ టర్మ్ కూడా పైన ఎన్.డీ.ఏ ఉన్నా ఏపీకి చేసింది ఏమీ లేదు అందుకే బీజేపీకి వ్యతిరేకంగా జగన్ మాట్లాడాలని కోరుతున్నారు. ఐతే అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కి దూరమైతే జగన్ పరిస్థితి ఏంటనది అందరికీ తెలుసు కాబట్టే ఆయన అంత డేర్ చేయలేకపోతున్నారని అంటున్నారు. ఐతే జగన్ అలానే ఉంటే మాత్రమే ఏపీలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. కేంద్రంలో ఇండియా కూటమికి కూడా ఇప్పుడు బాగానే కలిసి వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం వైసీపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పెద్ద ప్లానింగ్ లోనే ఉందని అర్ధమవుతుంది.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.