TGPSC : టీజీపీఎస్సీ నిర్వహించిన తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష ఫైనల్ కీని కూడా వెబ్ సైట్ లో అధికారులు పొందుపరిచారు.
https://www.tspsc.gov.in/ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. పీడీఎఫ్ డౌన్ లోడ్ చేసుకొని తమ హాల్ టికెట్ నెంబర్ ను అభ్యర్థులు అందులో చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది. 1 పోస్టుకు 50 మంది అభ్యర్థుల చొప్పున మెయిన్స్ కోసం అభ్యర్థులను ఎంపిక చేశారు.
వచ్చే అక్టోబర్ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను టీజీపీఎస్సీ నిర్వహించనుంది. మెయిన్స్ కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్ 9 న ప్రిలిమ్స్ నిర్వహించగా.. నెల రోజుల్లోనే ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది.
అయితే.. గ్రూప్ 1 పరీక్షకు దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు హాజరు కాగా.. అందులో కేవలం 30 వేల మంది మాత్రమే మెయిన్స్ కు హాజరయ్యారు. అంటే.. 10 శాతం మంది అభ్యర్థులు మాత్రమే మెయిన్స్ కు అర్హత సాధించారు.
గ్రూప్ 1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరు 3 గంటల పాటు ఉంటుంది. ఇది రాత పరీక్ష. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. జనరల్ ఇంగ్లీష్ తో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.