T20 world cup 2024 : జూన్ 2న మొదలైన టీ20 వరల్డ్ కప్ మ్యాన్ జూన్ 29న ముగిసిన విషయం తెలిసిందే. 2007లో టీ20 కప్ గెలిచిన టీమిండియా మళ్లీ 17 ఏళ్ల తర్వాత టీ20 ఫార్మాట్‌లో విశ్వ విజేతగా నిలిచింది. శనివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో ఏడు పరుగుల తేడాతో భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నది. చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగింది. భారత ఫీల్డర్స్ అందరు కూడా సమిష్టిగా రాణించడంతో టీమిండియా మంచి విజయాన్ని అందిపుచ్చుకుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా 17 ఏళ్ల నిరీక్షణకు తెరదింపి దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్‌లోనూ అదే ట్రెండ్‌ను కొనసాగించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ ఇండియా గ్రూప్ స్టేజ్, సూపర్-8లో ఎదుర్కొన్న ప్రతి ప్రత్యర్థిని ఓడించింది.సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ని ఓడించిన జట్టు అతిపెద్ద మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది.
17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఇప్పుడు, ఈ ట్రోఫీతో, టీమ్ ఇండియా ICC నుంచి 2.45 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 20.42 కోట్ల బహుమతిని అందుకుంది. అయితే రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో ఛాంపియన్- అయిన భారత్.. రూ.20.36కోట్లు, రన్నరప్- సౌతాఫ్రిక- రూ.10.64కోట్లు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- విరాట్ కోహ్లీ- రూ.4.15 లక్షలు, స్మార్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్- సూర్యకుమార్- రూ.2.5 లక్షలు.ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ- జస్ప్రీత్ బుమ్రా- రూ.12.45 లక్షలు అందుకున్నారు. భారత జట్టు ఒక్కో విజయానికి విడిగా రూ.26 లక్షలు అందుకోనుంది. ఇవన్నీ కలిపితే ఈ టోర్నీ ద్వారా భారత జట్టు రూ.22.76 కోట్లు రాబట్టనుంది. తొలిసారి ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు 1.28 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10.67 కోట్లు) లభించింది. ఇది ఛాంపియన్ జట్టు ప్రైజ్ మనీలో సగం. ఇది కాకుండా, 8 మ్యాచ్‌లు గెలిచినందుకు విడిగా సుమారు 2.07 కోట్ల రూపాయలు. ఈ టోర్నీ ద్వారా దక్షిణాఫ్రికా మొత్తం రూ.12.7 కోట్లు ఆర్జించింది.సెమీ ఫైనల్‌లో ఓడిన జట్లకు ఐసీసీ రూ.6.56 కోట్ల ప్రైజ్ మనీని ఉంచింది.
దీని ప్రకారం సెమీ ఫైనల్స్‌లో ఓడిన ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్లకు రూ.6.56 కోట్లు వచ్చాయి. ప్రైజ్ మనీ కాకుండా ఒక్కో మ్యాచ్ విజయానికి ప్రత్యేకంగా రూ.26 లక్షలు అందజేస్తారు. సూపర్-8 రౌండ్ నుంచి నిష్క్రమించిన ఒక్కో జట్టుకు 3.18 కోట్లు అందుకోన్నాయి. గ్రూప్ స్టేజి దాటిన జట్టును ఖాళీ చేతులతో వెళ్లేందుకు ఐసీసీ అనుమతించలేదు. అంటే 9 నుంచి 12వ ర్యాంక్‌లో ఉన్న జట్లకు ఐసీసీ ఒక్కో మ్యాచ్ విజయంపై రూ.2.06 కోట్లు అందించనుంది. అలాగే 13 నుంచి 20వ ర్యాంకు జట్లకు దాదాపు రూ.1.87 కోట్లు ఇవ్వనుంది.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.