Nellore Roti Festival : రొట్టెల పండుగ తెలుసు కదా. ఈ పండుగ అక్కడ చాలా ఫేమస్. మరెక్కడా ఇలాంటి పండుగను మనం చూసి ఉండం. కానీ.. నెల్లూరులో మాత్రం రొట్టెల పండుగ అనేది చాలా ఫేమస్. అక్కడి వారి సంప్రదాయం అని కూడా చెప్పుకోవచ్చు. ఆ పండుగ తాజాగా ప్రారంభం అయింది. ఈ రొట్టెల పండుగ నెల్లూరులోని బారాషహీద్ దర్గా వద్ద జరుగుతుంది.
దీంతో బారాషహీద్ దర్గా వద్దకు భారీగా భక్తులు తరలివచ్చారు. అక్కడ ఇచ్చే రొట్టెల కోసం దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా చేరుకున్నారు. దర్గా దగ్గరే ఉన్న స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి కోర్కెలు తీర్చే రొట్టెలను బంధుమిత్రులతో పంచుకుంటున్నారు.
అనంతరం బారాషహీద్ దర్గాలో మొక్కులు చెల్లించి రొట్టెల పండుగను భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ కోసం పోలీసులు, స్థానిక నేతలు ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా సెక్యూరిటీని పెంచారు. 2 వేల మంది పోలీసులను ఈ పండుగ నేపథ్యంలో నియమించారు. ఇవాళ్టి నుంచి ప్రారంభం అయిన ఈ పండుగ ఐదు రోజుల పాటు ఘనంగా జరుగుతుంది.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.