Rohit Sharma : రోహిత్ శర్మని ముంబై ఇండియన్స్ mumbai indians కెప్టెన్సీ నుండి తప్పించడం ఎంత పెద్ద వివాదాస్పదం అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఐదు టైటిళ్లు సాధించిపెట్టిన తనని కాదని, హార్దిక్ పాండ్యాకు hardik pandya కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడని.. అందుకే అతను జట్టు నుంచి వైదొలగాలని భావిస్తున్నాడని కొన్ని ప్రచారాలు కూడా సాగాయి. రోహిత్‌కి అన్యాయం జరిగిందని.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ హార్ధిక్ పాండ్యాను దారుణంగా ట్రోల్ చేయడం మనం చూశాం. రోహిత్‌ని తప్పించి హార్ధిక్‌ని కెప్టెన్ గా చేసినందుకు ప్రతి చోట ఆయనపై విమర్శల వర్షం కురిసింది. అయితే దానిపై రోహిత్ ఎప్పుడు ఎక్కడ స్పందించింది లేదు.
తాజాగా కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో మాట్లాడుతూ రోహిత్ శర్మ తన మనసులోని బాధనంత బయటపెట్టాడు. వారి సంభాషణలో రోహిత్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వారి సంభాషణను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన కేకేఆర్.. వెంటనే దాన్ని డిలీట్ చేసింది. అయినా కూడా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా రోహిత్ శర్మ, అభిషేక్ నాయర్ కొద్ది సేపు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో రోహిత్ మాట్లాడుతూ.. ‘ఒక్కో ఒక్కో విషయం మారుతోంది. అది వాళ్లపైన ఉంది.. నాకు ఎలాంటి ఫరక్ పడదు. నేను ఎక్కడికి వెళ్లను. ఏది ఏమైనా.. ఇది నా ఇల్లు. ఆ టెంపుల్ నేను నిర్మించింది. నాకేంటి.. ఇదైతే నా లాస్ట్..’ అని రోహిత్ అన్నాడు.
రోహిత్ మాటలని బట్టి ఏం అర్ధమవుతుంది అంటే… పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం, ముంబై ఇండియన్స్ టీమ్ ప్రదర్శన, నెక్ట్స్ ఇయర్ ప్లాన్ గురించి మాట్లాడినట్లు అర్థం అవుతోంది. ముంబై ఇండియన్స్ టీమ్‌లో అనేక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. రోహిత్ ముంబైలో ఉంటున్నాడు కాబట్టి ఆయన ఇది నా ఇల్లు అన్నాడని, ముంబైకి ఐదు కప్పులు అందించాడు కాబట్టి ఇది నా సామ్రాజ్యం అని రోహిత్ అన్నట్టు జనాలు ముచ్చటించుకుంటున్నారు. ప్రస్తుతం రోహిత్ వీడియో వైరల్‌గా మారింది.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.