Ntv Interview With Narendra Modi :తెలుగు మీడియా చరిత్రలో ఈరోజు నిజంగా సంచలనం జరగబోతుంది. మునుపెన్నడూలేని విధంగా తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. ఈ ఘనత ఎన్టీవీ కి దక్కటం గమనార్హం. తెలుగు మీడియా చరిత్రలో తొలిసారి ఎన్టీవీ కి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు రాత్రి 8 గంటలకు తన మనసులోని మాటను ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీవీతో పంచుకొనున్నారు. దాదాపు 10 సంవత్సరాలుగా భారతదేశాన్ని పాలిస్తూ తిరుగులేని విజయాలను అందిస్తూ ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న నరేంద్ర మోడీ ఈరోజు రాత్రి 8 గంటలకు ఎన్టీవీ మీడియాతో కలిసి మరో 4 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల గురించి మాట్లాడనున్నారు…
అయితే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీడియా వారికి అతి తక్కువ సమయం ఇవ్వగలిగేంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీవీ కి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఒకసారి భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ కీలక సమయంలో ఎన్టీవీ కి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎన్టీవీ దేశ టెలివిజన్ చరిత్రలోనే అరుదైన రికార్డును బద్దలు కొట్టిందని చెప్పవచ్చు.
అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ఈరోజు ప్రధాని మోడీ సమాధానం ఇవ్వనున్నారు. తెలుగు ప్రజల మెదల్లో నానుతున్న ఎన్నో ప్రశ్నలకు ఈరోజు ఆయన సమాధానం చెప్పనున్నారు. అంతేకాకుండా ప్రజలకు ఉన్న సందేహాలు అన్నింటిని ఈరోజు రాత్రి తెలుగు ప్రజల తరఫున ఎన్టీవీ ప్రశ్నించనుంది. ఇక ఈ ఒకే ఒక్క ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ తో నరేంద్ర మోడీ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు దగ్గర కానున్నారు.
అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం ఈ లింకు క్లిక్ పై క్లిక్ చేసి వీక్షించండి. Click Here Ntv Interview With PM Modi
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.