Prabhas : సలార్ వంటి భారీ హిట్ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కల్కి. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని అశ్వినిదత్ నిర్మించారు.జూన్ 27న చిత్రం విడుదల కానుండగా, మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కల్కి 2898 ఏడీ మూవీ నుంచి బుజ్జి పాత్రను పరిచయం చేయడానికి ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో కల్కి చిత్రంలో భైరవ (ప్రభాస్) వాడే వాహనం బుజ్జిని పరిచయం చేశారు. బుజ్జి అంటూ పరిచయం చేసేందుకు నాలుగు కోట్ల వరకు ఖర్చు పెట్టి ఈవెంట్ చేశారు. ఇందులో గ్లింప్స్ విడుదల చేయగా, ఇది అంతగా ఆకట్టుకునేలా కనిపించలేదు. కారును మేకర్స్ పరిచయం చేసిన తర్వాత ఈ బుజ్జి గురించి అందరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇండియాలో అతి పెద్ద కారుగా చెబుతుండగా, ఈ మాన్‌స్టర్ కారు బరువు ఆరు టన్నులు కావడం విశేషం. స్టార్ స్టార్ రెబల్ స్టార్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఈ కారును దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేశారు. రేణుకా కృపలానీ అనే వ్యక్తి ఈ కారు ప్రత్యేకతల గురించి వివరించడం అందులో చూడొచ్చు.దాదాపు ఏడు కోట్ల రూపాయలతో ఈ కారుని తయారు చేసినట్టు చెబుతున్నారు. ఇందులో కారు టైర్ పొడవు -6075 మిమీ, వెడల్పు -3380 మిమీ, ఇక ఎత్తు -2186 మిమీ. రిమ్ సైజ్ -34.5 ఇంచెస్. ఈ కారు పవర్ 94Kw, బ్యాటరీ 47KWH. ఈ స్పెషల్ కారును కల్కి సినిమాలో ప్రభాస్ కోసం ప్రత్యేకంగా రెడీ చేయడం కోసం ఇంజనీర్లు ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది. బుజ్జి కారుకు హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికీ భారీ హైప్ నెలకొంది.
కల్కి 2898 ఏడీ మూవీలో ఈ కారును భైరవ పాత్రే సొంతంగా తన చేతులతో ఈ కారును తయారు చేసినట్లుగా చూపించినట్లు కూడా ఈ వీడియోలో చెప్పడం చూడొచ్చు. కారు వెనుక భాగంలోని ఛాంబర్ లో హీరో తాను బంధించిన వారిని ఉంచేందుకు వాడతారట. ఇక ఈ కారు వెనుక భాగంలో చాలా పెద్దగా ఉన్న ఒకే టైరు ఉంది. దీని సాయంతోనే ఈ కారు ఎటు కావాలంటే అటు వెళ్తుంది.డైరెక్టర్ నాగ్ అశ్విన్ కోరిక మేరకు తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఉన్న జయం మోటార్స్ ఈ కారు తయారీలో మేకర్స్ కు సాయం చేసింది. కల్కి మూవీ కోసం ఈ కారు ఒక్కటే కాదు.. ఎన్నో కొత్త కొత్త ఆయుధాలను కూడా తయారు చేసినట్లు నాగ్ అశ్విన్ గతంలోనే చెప్పాడు. అవన్నీ మెల్లమెల్లగా రివీల్ చేయనున్నారు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.