PM Modi : నరేంద్రమోడీ సాధారణంగా ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వరు. గడిచిన పదేండ్లుగా ఆయన ప్రధానిగా ఉన్నా సరే.. ఏనాడు మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఇక ఎన్నికల సమయంలో అయితే ఆయన అసలే మీడియాను దగ్గరకు కూడా రానివ్వరు. అప్పుడప్పుడు ఆయన అనుకున్నప్పుడు మాత్రమే తాను కోరుకున్న ఒకరిద్దరితో ఇంటర్వ్యూ చేయించుకుంటారు. అంతే తప్ప అంతకు మించి ఎవరికి పడితే వారికి అసలే ఇంటర్వ్యూ ఇవ్వరు. అలాంటిది మూడోసారి ప్రధాని కావాలని ఆరాటపడుతున్న పెద్దాయన.. తాజాగా ఆయన కోరుకున్న ఎఎన్ఐ రిపోర్టర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
దాదాపు 75 నిముషాలు ఉన్న ఈ ఇంటర్వ్యూని చూస్తే అసలు ఇందులో ఏముంది అనే ప్రశ్న అందరికీ వస్తుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ రావాలే గానీ ప్రతి ఒక్క జర్నలిస్టు మోడీని అనేక ప్రశ్నలు అడగొచ్చు. పదేండ్లుగా పరిపాలించారు కాబట్టి ఎన్నో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టుకోవచ్చు. అందులోనూ దేశ అప్పుల గురించి అడగొచ్చు. గత 50 ఏళ్లలో కంటే మోడీ హయాంలోనే ఎక్కువ అప్పులు అయ్యాయి. మరి దీనిపై ప్రశ్న వేయాలి కదా.. అదేంటో గానీ అసలు ఈ ప్రశ్ననే రాలేదు. ఒక లేడీ జర్నలిస్టుకు అవకాశం వస్తే ఏ మాత్రం మోడీకి ఇబ్బంది కలిగే ప్రశ్నలే లేవు.
కేవలం మోడీ ఏం కోరుకుంటున్నారో అవే ప్రశ్నలు జర్నలిస్టు నుంచి రావడం ఇక్కడ గమనార్హం. కేవలం మోడీకి అనుకూల ప్రశ్నలే రావడం ఇంకా విచిత్రం. అంటే ప్రధానిగా మోడీ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారో.. తన ఆశలు, ఆశయాలు అంటూ మోడీ చెప్పదలచుకున్న వాటికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఇంటర్వ్యూలో ఉన్నాయి. అంతకు మించి మోడీని విమర్శించే ప్రశ్న ఒక్కటి కూడా లేదు. మోడీ తెచ్చిన చట్టాల గురించి గానీ, దేశ ఆర్థిక వృద్ధి గురించి గానీ, ఉపాధి గురించి గానీ, నల్లడబ్బు వెనక్కు తేవడం గానీ ఇలా ఏ ఒక్క దాని గురించి కూడా ప్రశ్న రాలేదు.
ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన వారంతా అసలు ఇది ఇంటర్వ్యూనా లేదంటే మోడీ భజన ప్రోగ్రామా అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మాత్రం దానికి మోడీ ఇంటర్వ్యూ అని పెద్ద పెద్ద రాతలు ఎందుకు అంటున్నారు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూ మోడీ కోరి చేయించుకున్నది.. కోరినట్టు చేయించుకున్నది.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.