Bharateeyudu 2 : నిన్నా మొన్నటి వరకు అందరం కల్కి మూవీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అందరూ భారతీయుడు 2 మూవీ వైపు మళ్లారు. సినీ అభిమానుల కోసం మరో పాన్ ఇండియా మూవీ ఈ వారం రిలీజ్ కాబోతోంది. జులై 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న భారతీయుడు మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలోనే జరిగింది. నిజానికి.. కమల్ హాసన్ మూవీ తెలుగులో ఇంత భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఇదే తొలిసారి.
అంటే.. ఈసారి భారతీయుడు మూవీతో కమల్ హాసన్ తెలుగులోనూ ఒక చరిత్ర సృష్టించబోతున్నారని స్పష్టం అవుతోంది. ఈ మూవీ తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ప్రీ రిలీజ్ బిజినెసే రూ.24 కోట్లకు జరిగింది. అసలు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెటే రూ.25 కోట్లు. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందే ఈ సినిమా హిట్ స్టాటస్ లోకి వచ్చేసింది. ఇంకో కోటి వస్తే సినిమా హిట్ అయినట్టే. పెట్టిన డబ్బులు వచ్చినట్టే లెక్క. కానీ.. ఇక్కడ ప్రీ రిలీజ్ బిజినెసే భారీ స్థాయిలో జరగడంతో టాలీవుడ్ లో కమల్ హాసన్ మరో చరిత్ర సృష్టించబోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
నిజానికి.. భారతీయుడు 2 అనేది స్ట్రెయిట్ తెలుగు మూవీ కాదు. తెలుగు డబ్ మూవీ. ఒక డబ్ మూవీకి ఈ రేంజ్ లో బిజినెస్ జరగడంతో కమల్ హాసన్ కెరీర్ లోనే ఇదే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న మూవీగా రికార్డు సాధించింది. అందుకే ఈ మూవీపై భారీగానే అంచనాలు కూడా పెరిగాయి. ఈ మూవీ విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని సినిమా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను తమిళం, తెలుగులో విడుదల చేస్తున్నారు.
1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది కూడా భారతీయుడు లాగానే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీనే. లంచాలు తీసుకునే అధికారులకు సరైన బుద్ధి చెప్పే పాత్రలో కమల్ హాసన్ నటించారు. ఈ మూవీకి శంకర్ డైరెక్టర్. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. మరో ముఖ్య పాత్రలో ఈ సినిమాలో ప్రముఖ డైరెక్టర్ ఎస్‌జే సూర్య కూడా నటించాడు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.