Raining : ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాటిని సరిగ్గా వాడుకుంటే మనకు చాలా లగ్జరీ లైఫ్ దొరుకుతుంది. కానీ వాటిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో కూడా తెలిసి ఉండాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడుతున్నాయి. దాంతో చాలా మందిలో కొన్ని అనుమానాలు ఉంటున్నాయి. పిడుగులు పడుతున్న సమయంలో కచ్చితంగా ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఆఫ్ చేయాలా వద్దా ఆన్ లో ఉంటే ఏమవుతుంది అని అనుకుంటారు.
వాస్తవానికి పిడుగులు పడుతున్న సమయంలో కచ్చితంగా టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ లాంటివి ఆఫ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే పిడుగులు పడుతున్న సమయంలో వాటికి పవర్ రీ జనరేట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే బయట పిడుగులు పడుతుంటే మాత్రం కచ్చితంగా వీటిని ప్లగ్ నుంచి అన్ ప్లగ్ చేయాలి. అంతే కాకుండా స్విచ్ కూడా ఆఫ్ చేయాలి. వర్షం పడుతున్న సమయంలోనే పిడుగులు పడకముందే ఇలా చేస్తే ఇంకా మంచిది. కొన్ని సార్లు పిడుగు పడినా చెక్కుచెదరకుండా ఉంటాయన్న ఆలోచన ఏమాత్రం సరికాదు. ఎందుకంటే భూమి కూడా అప్పుడప్పుడు ప్రమాదకరంగానే మారుతుంది.
ఇక వస్తువులను ఎర్తింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం రాదని అనుకుంటారు. కానీ ఇది కూడా మంచిది కాదు. కాబట్టి అన్నీ ఆఫ్ చేసుకోవాలి. అంతే కాకుండా వైఫై ఆన్ లో ఉన్నప్పుడు కూడా రూటర్ పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వైఫైని ఆఫ్ చేయడం చాలా మంచిది. ఇక సెల్ ఫోన్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బయట వర్షం బాగా పడుతుంటే మాత్రం సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఛార్జింగ్ మోడ్‌లో పెడితే పిడుగుపాటుకు ఫోన్ పాడయ్యే ప్రమాదం ఉంది. మొబైల్ ఫోన్ చార్జింగ్ అవుతుంటే మాత్రం కచ్చితంగా దాన్ని అన్ ప్లగ్ చేయాలి.
ఇక బయట మెరుపులు మెరుస్తూ వాన పడుతున్న సమయంలో కూడా ఇంట్లో ప్రశాంతంగా ల్యాప్ ట్యాప్ వాడుకోవచ్చు. కాకపోతే దాన్ని చార్జింగ్ పెట్టి పనిచేయొద్దు. అన్ ప్లగ్ చేసుకుని అందులో ఉన్న చార్జింగ్ తోనే పని చేసుకుంటే బెటర్.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.