Hardik Pandya : హార్ధిక్‌ని ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడు అంటూ వారందరికి వార్నింగ్
Hardik Pandya : భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ముంబై కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత ఆయన దారుణమైన ప్రదర్శన కనబరచడం, జట్టుని కూడా ప్లే ఆఫ్స్‌కి తీసుకెళ్లలేక చాలా విమర్శల పాలయ్యాడు. మరోవైపు ఇటీవల ఆయన విడాకుల వార్తలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా నడుస్తున్న బ్యాడ్ ఫేజ్‌ను దాటాలని టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫిక్స్ అయ్యాడు. ఐపీఎల్లో సరిగ్గా ఆడకపోవడంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ నుంచి తీవ్రంగా విమర్శలు రావడం, ప్రపంచ కప్ జట్టులోకి హార్దిక్‌ను తీసుకోవద్దనే డిమాండ్లు రావడం కూడా తెలిసిందే.
అయితే ఇన్ని విమర్శల నడుమ బాగా సతమతమైన పాండ్యా వరల్డ్ కప్ కోసం యూఎస్ చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో 23 బంతుల్లోనే 2 బౌండరీలు, 4 సిక్సుల సాయంతో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అలాగే బౌలింగ్ వేసి ఒక వికెట్ కూడా తీశాడు. తన కమ్‌బ్యాక్‌ను ఘనంగా చాటాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హార్దిక్‌ను ఎంత కిందకు తొక్కితే అంత పైకి లేస్తాడని నవ్‌జ్యోత్ సిద్ధు కామెంట్ చేశాడు. అతడు వజ్రం లాంటోడని.. ఎంత సానబెడితే అంత మెరుస్తూ ఉంటాడని ప్రశంసలు కురిపించాడు. తనపై వచ్చిన విమర్శలు, ప్రశ్నలన్నింటికి బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌తో సమాధానం ఇచ్చాడని అంటున్నారు. పాండ్యాను ఎంత ప్రెజర్లో పెడితే అతడు అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తాడని ప్రశంసల జల్లులు కురిపించాడు.
అతడితో పెట్టుకోవద్దంటూ విమర్శకులకు వార్నింగ్ ఇచ్చాడు. ఐర్లాండ్‌తో ఫస్ట్ మ్యాచ్ గురించి కూడా సిద్ధు కామెంట్స్ చేశాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌ను గనుక ఆడించాలని అనుకుంటే వార్మప్ మ్యాచ్‌లో అతడ్ని బరిలోకి దించాల్సిందని పేర్కొన్నాడు. జైస్వాల్‌ను ఆడించలేదు కాబట్టి ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్-కోహ్లీ ఓపెన్ చేయడం పక్కాగా కనిపిస్తోందన్నాడు. రోహిత్- కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే 5 మంది బౌలర్స్ ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఐదుగురు ప్రధాన బౌలర్లకు తోడుగా హార్దిక్ ఆరో బౌలర్‌గా ఉంటాడని.. అప్పుడు బౌలింగ్ దళం మరింత బలోపేతం అవుతుందన్నాడు. ఇక హార్ధిక్ పాండ్యా ఇప్పుడు తన సత్తా ఏంటో కూడా నిరూపించుకోవలసి ఉంటుందని తెలియజేశాడు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.