Diabetic Patients : షుగర్ వ్యాధి బాధితులకు శుభవార్త. మాత్రలకు షుగర్ కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ ఇంజక్షన్లు తప్పనిసరి. ప్రతిరోజు ఇంజక్షన్ పొడుచుకోవాల్సిందే. ఒక రెండు క్షణాల పాటు ఆ నొప్పి ని బరించాల్సిందే. అయితే రోజు ఈ బాధ నుంచి బయట పడేందుకు ఒక ఆల్టర్నేట్ అందుబాటులోకి వచ్చింది.ఇంతకీ ఈ ఆల్టర్నేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మంది షుగర్ బాధితులు ఉన్నారు. వారిలో సుమారు ఏడు కోట్ల మంది షుగర్ కంట్రోల్ కోసం ప్రతిరోజు ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకుంటున్నారు. ఆ ఇంజక్షన్ల బాధను వారు ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నారు. అయితే కొంతమంది ఆ బాధను తట్టుకోలేక మాత్రలతో సరిపెట్టుకుంటున్నారు.ఎంతో కాలం నుండి కొనసాగుతున్న ఈ పరిస్థితి నుండి షుగర్ వ్యాధి బాధితులను కాపాడేందుకు జరిగే పరిశోధనలో యుఐటీటీ ఆర్కిటెక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే , యూనివర్సిటీ ఆఫ్ సిగ్వి సైంటిస్టులు ఒక వినూత్నమైన విధానాన్ని కనుగొన్నారు.ఈ విధానం సిగ్వి నార్వే విశ్వవిద్యాలయ పరిశోధనల ప్రొఫెసర్ల సారం జనరల్ ఆఫ్ నేచర్ , నేనొ టెక్నాలజీలో వెళ్లడైంది. ఈ నేపథ్యంలోనే ఇన్సులిన్ ఇంజక్షన్ స్థానంలో ఒక రకమైన చాక్లెట్లను ఉత్పత్తి చేశారు.
ఇక ఈ చాక్లెట్లో మనిషి వెంట్రుకల కంటే చిన్న పరిమాణంలో ఉండే నానో క్యారియర్లు ఉన్నాయి. వీటిలో ఇన్సులిన్ నిక్షిప్త మై ఉంటుంది. శరీరం తగినంత పరిణామంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయనప్పుడు రక్తంలో ఉన్న చక్కెరను ప్రాసెస్ చేయడం సాధ్యం కాదు. ఇక శక్తి రూపంలో కి మారి మనిషి మనుగడకు దోహదపడాల్సిన ఆ చక్కెర పదార్థం షుగర్ రూపంలోనే మనిషి శరీరంలో ఉండిపోతుంది.అలా నిలిచిపోయిన షుగర్ వల్ల కిడ్నీలు పాడవుతాయి.దానితో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.అయితే ఇప్పుడు సైంటిస్టులు తయారు చేసిన ఆ చాక్లెట్లు చక్కటి పరిష్కారాన్ని అందిస్తాయి. అసలు ఈ నానో క్యారియర్ విధానాన్ని ఓ పదేళ్ల కిందటే సైంటిస్టులు కనిపెట్టారట. అయితే ఆ సమయం లో ఇన్సులిన్ నింపుకొని కడుపులోకి వెళ్లిన ఈ క్యారియర్లు కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాల కారణంగా అతలాకుతలం అవడం ప్రారంభించాయట. దీంతో షుగర్ ను శక్తిగా మార్చే లక్ష్యాన్ని అవి చేరుకోలేకపోయేవి.
ఇప్పుడు యాసిడ్ వల్ల నానో క్యారియర్లు తునాతన కలయిపోకుండా కాపాడే ఒక రకమైన పూతను సైంటిస్టులు తయారు చేశారు. ఇన్స్టెంట్ నానో కారియర్లకు ఈ పూతను పోయడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని ఇన్స్టంట్ లివర్ దాకా చేరే ప్రక్రియను సహకారం చేసినట్లు ఆర్కిటెక్స్ ఆఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పీటెట్ మెక్ వెల్లడించారు. అలాగే రక్తంలో చక్కెర సాయి పెరిగినప్పుడు ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్ లు చురుగ్గా మారి ఆ పూతను విచ్ఛిన్నం చేస్తాయి. పూత కరిగిపోయినప్పుడు ఇన్సులిన్ విడుదల అవుతుంది.ఇది రక్తం నుండి చక్కెరను తొలగించడానికి పనిచేస్తుంది. తద్వారా షుగర్ ఒకవేళ పెరిగితే శరీరంలో ఆటోమేటిక్ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది.
ఈ ఇన్సులిన్ చాక్లెట్ల ఉత్పత్తిని ఇప్పటివరకు జంతువుల మీద ప్రయోగాలు జరిగాయి. చివరిసారి దీన్ని బాపుల్ పై పరీక్షించారు. పరీక్షా ఫలితాలు కూడా బాగున్నాయి. అదేవిధంగా ఎలుకలపై కూడా ప్రయోగాలను చేశారు. ఇక్కడ కూడా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో వచ్చే ఎడాది ఈ చాక్లెట్లను మానవులపై ప్రయోగించనునట్లు తెలుస్తోంది. ఇది ఓకే అయితే ఇక నుండి మనుషులు షుగర్ కోసం ఇంజక్షన్లు పొడిపించుకోవాల్సిన అవసరం లేదు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.