Enforcement Directorate : మన దేశ ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన విభాగాల్లో ఈడీ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కూడా ఒకటి. దీన్ని సింపుల్ గా ఈడీ అని పిలుస్తుంటారు. దీని ముఖ్య విధి ఏంటంటే.. హవాలా రూపంలో డబ్బులు తరలించడంపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) అనుసరించి ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ ఆర్థిక నేరాలను ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దేశంలోని పెద్ద పెద్ద నేరాలలో ఎక్కువగా ఈడీ దర్యాప్తు చేపడుతుంది. ఈ మనీ లాండరింగ్ కేసులు అంటేనే చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. అంతే కాకుండా అందులో చాలా పెద్ద తలకాయలే ఉంటాయి.
అందుకే అంత పెద్ద కేసులను ఛేదించే ఈ దర్యాప్తు సంస్థకు మనదేశంలో చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఇందులో జాబ్స్ ఎలా ఉంటాయి.. జీతం ఎంతం ఉంటుంది అనే విషయాలను తెలుసుకుందాం. ఈ విభాగంలో ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (SSC CGL) పరీక్ష ద్వారా చేపడతారు. దీనికి ఏ యూనివర్సిటీ నుంచి అయినా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి వయసు 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి.
ఇందులో జీతభత్యాలు కూడా బాగానే ఉంటయాఇ. ఇందులో పని చేసే ఏఈవోకు రూ.44,900 నుంచి రూ.1,42,400 మధ్య ఉంటుంది. కటింగ్స్ పోను AEO నికర జీతం దాదాపు రూ.72,000. ఈడీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు చాలా సుదీర్ఘమైన ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో ఏఈవోలుగా బాధ్యతలను చేపట్టడానికి నైపుణ్యాలు, నాలెడ్జ్‌ను ట్రైనింగ్‌లో నేర్చుకుంటారు.
ఏఈవోలుగా బాధ్యతలు స్వీకరించిన వారు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) కింద పని చేయాల్సి ఉంటుంది. ఈ చట్టాలను అమలు చేయడమే వారి విధి. ఎవరైనా ఈ చట్టాలను ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటారు పై అధికారులు. ఎలాంటి అనుమానిత వ్యక్తులు, వాహనాల్లో తనిఖీలు చేపట్టేందుకు ఈడీకీ స్పష్టమైన అధికారాలు ఉంటాయి.
వాటితో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నేరగాళ్ల ఇళ్లపై దాడులు చేసి తనిఖీలు చేసే అధికారాలు ఈడీకి ఉంటాయి. వీటితో పాటు అవినీతి కేసులో దొరికే డబ్బులు, ఇతర అనుమతులు లేని ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసే బాధ్యతలను కలిగి ఉంటుంది.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.