Devara Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఈ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కగా, చిత్రానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ సముద్రాల ఒడ్డులో ఉండే ఊళ్ళల్లో జరిగే మాస్ కథ అని కొరటాల ఈ సినిమాపై అంచనాలు పెంచారు. ఇక రెండు పార్టులు కావడంతో దేవర పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. అభిమానులంతా దేవర సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో దేవర సినిమాలో రౌడీల్లో ఒకడిగా నటించిన వ్యక్తి సినిమా స్టోరీ మొత్తం లీక్ చేశాడు. దీంతో అందరు షాకింగ్‌లో ఉన్నారు. ఎన్టీఆర్ సముద్రం దగ్గర పది ఊర్లకు కాపరిగా ఉంటాడు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తను ముందుండి చూసుకుంటాడు. అందరికి అండగా నిలబడుతూ రక్షిస్తుంటాడు. సముద్రం దగ్గర ఫైట్ సీన్ ఉంటుంది. అందర్నీ నరికే సీన్ అయితే హైలైట్. ఏకంగా పదివేల మందితో ఫైట్ సీన్. సముద్రం అంతా రక్తంతో నిండిపోద్ది. యాక్షన్ సీన్స్ ని మేము లైవ్ లో చూసి షాక్ అయ్యాం. ఎన్టీఆర్ నటన చూసి మైండ్ బ్లోయింగ్ అయిపోద్ది. సింగిల్ టేక్ లో చెప్పేస్తాడు అన్ని. సినిమా రిలీజయితే బట్టలు చింపేసుకుంటారు ఫ్యాన్స్, థియేటర్స్ బద్దలు అయిపోతాయి అంటూ దేవర స్టోరీ లైన్ ని లీక్ చేసి సినిమా పై మరింత హైప్ పెంచాడు.
మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. అయితే దేవర టైటిల్ సాంగ్ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సాంగ్ సోసోగా ఉందని చెప్పేశారు. తారక్ కెరియర్ లోనే 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ లో ఒకటిగా ఇది నిలిచింది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం టాప్ 10లో కూడా ఈ పాటకి స్థానం లభించలేదు. టాలీవుడ్ లో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ జాబితాలో చూసుకుంటే టాప్ 4 పాటలు మహేష్ బాబు సినిమాలలోనివే కావడం విశేషం. 17.42 మిలియన్ వ్యూస్ తో గుంటూరు కారం సినిమాలోని దమ్ మసాలా సాంగ్ టాప్ 1లో ఉంది.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.