Prabhas : ప్రభాస్ పేరు చెప్పగానే ఒక బాహుబలి, ఒక సలార్, ఒక కల్కి గుర్తొస్తాయి. ప్రభాస్ ఇప్పుడు కేవలం పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు. ప్రభాస్ అంటే గ్లోబల్ స్టార్. బాహుబలి సినిమాతోనే ప్రభాస్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు కల్కి సినిమాతో తన స్థానాన్ని అలాగే పదిలంగా ఉంచుకోగలిగాడు. ఇటీవల విడుదల అయిన కల్కి మూవీ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు చేస్తోంది.
అయితే.. ఇప్పుడు మనం ప్రభాస్ కల్కి మూవీ గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడికి రాలేదు. ప్రభాస్ పెట్టుకున్న సన్ గ్లాసెస్ గురించి చెప్పుకోవాల్సి వస్తోంది. ఆ సన్ గ్లాసెస్ కు ఉన్న ప్రత్యేకత. కల్కి సినిమాలో ప్రభాస్ పెట్టుకున్న సన్ గ్లాసెస్ గురించే మనం మాట్లాడుకునేది. పంజాబీ పాప్ సింగర్ దిల్జిత్ తో కలిసి కల్కి సినిమాలో డార్లింగ్ స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఆ పాట కోసం ప్రభాస్ తన మేకోవర్ మొత్తం మార్చేశాడు. పంజాబీ స్టైల్ లో కనిపించాడు ప్రభాస్. ఆ పాటలో ప్రభాస్ సన్ గ్లాసెస్ ధరించాడు. సినిమా ప్రమోషన్లలోనూ ప్రభాస్ సన్ గ్లాసెస్ ధరించాడు. ఆ సన్ గ్లాసెస్ పేరు డోల్స్ అండ్ గబ్బానా. ఆ సన్ గ్లాసెస్ ఏదో సాదాసీదా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.
అవి చాలా కాస్ట్‌లీ అద్దాలట. డోల్స్ అండ్ గబ్బానా బ్రాండ్ అద్దాలు అవి. వాటినే డీ అండ్ జీ అని కూడా అంటారు. స్క్వైర్ ఫ్రేమ్ టింటెడ్ సన్ గ్లాసెస్ అవి. వాటి ధర మన ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.35,314 అట. అది అసలు మ్యాటర్. ప్రభాస్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఆయన ధరించిన గ్లాసెస్ ధరే అంత ఉంటే.. ఇక ప్రభాస్ వేసుకునే డ్రెస్సుల ధర ఎంత ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.