[njwa_button id="1872"]
Categories: News

Chicken Fry Recipe : 1 కేజీ చికెన్ తో అన్నం, బిర్యానీ, చపాతీ లోకి మతిపోయే చికెన్ ఫ్రై…

Chicken Fry Recipe : ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీని చూడబోతున్నాం.. కేజీ చికెన్ తో చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు అదిరిపోయేలా గుమగుమలాడే చికెన్ ఫ్రై చేయాలి అంటే.. ఇది బెస్ట్ రెసిపీ అండి.. ఈజీగా త్వరగా చేసుకోగలిగే రెసిపీ అండ్ 100 టైమ్స్ బెటర్ దెన్ రెస్టారెంట్ స్టైల్ అన్నమాట. ఈ చికెన్ ఫ్రై డ్రై గా లేకుండా వెట్ గా ఉంటుందన్నమాట. అంటే గ్రేవీ కూడా భలేగా వస్తుంది. బిర్యానీ చేసుకున్నా లేదా మీరు చపాతీతో సర్వ్ చేసుకోవాలనుకున్న.. రైస్ తో సర్వ్ చేసుకోవాలనుకున్న చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ గుమగుమలాడే చికెన్ ఫ్రై ని ఎలా చేసుకోవాలో చూద్దామా..

Advertisement

Chicken Fry Recipe : దీనికి కావలసిన పదార్థాలు

చికెన్, ఆయిల్, బటర్, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ,పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, చికెన్ మసాలా, పెరుగు, కొత్తిమీర, పుదీనా, టమాటాలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, గసగసాలు మొదలైనవి… ఫస్ట్ అయితే కేజీ చికెన్ తీసుకోండి. చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా వాష్ చేసేసేయండి. అలా క్లీన్ చేసుకుని నీళ్లు అనేవి లేకుండా చికెన్ ని మాత్రమే బౌల్ లోకి తీసుకోండి. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి.

Advertisement
Chicken Fry Recipe : 1 కేజీ చికెన్ తో అన్నం, బిర్యానీ, చపాతీ లోకి మతిపోయే చికెన్ ఫ్రై…

రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం, ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేయండి. అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసేసి ఈ మసాలాలు అన్ని కూడా చికెన్ కి బాగా పట్టే విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలపండి. ఇలా కలుపుకున్న చికెన్ ని మీరు కావాలంటే ఫ్రిజ్లో ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవచ్చు.. లేదంటే బయట ఒక హాఫెన్ హావర్ వదిలేసిన పర్వాలేదండి. ఫ్రై ఏ కదా చక్కగా వేగిపోతుందన్నమాట.. మీకు కొద్దిగా జ్యూసీగా టెండర్ గా చికెన్ ఉండాలి అనుకుంటే ముందు రోజు నైట్ చేసుకొని ఫ్రిజ్లో అయినా పెట్టేసుకోవచ్చు.. అది మీ కన్వీనియంట్ ని బట్టి మీరు చేసుకోవచ్చు.

ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా గసగసాలు కూడా వేసేసి కొద్దిగా నీళ్లు వేసి ఒక అరగంట నానబెట్టండి. ఇవి నాని లోపు మనం చికెన్ ని ఫ్రై చేసుకుందాము. చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ కూడా వేసుకుని బటర్ని కరగనివ్వండి.బటర్ కరిగిన తర్వాత నూనె హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలాగా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసేసి గరిటతో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి.

పూర్తిగా వేగిపోవాలని అంతవరకు కూడా మీరు కలుపుతూనే వేయించుకోవాలి. ఇందులో ఉండే వాటర్ అంతా అయిపోవాలి. చికెన్ చక్కగా వేగిపోవాలి. వేయించుకున్న చికెన్ ని ఈ పాన్ లోంచి పక్కకి తీసేసేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎక్స్ట్రా కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ మనం ఇందులోకి కొద్దిగా పోపులాగా వేసుకుని ఫ్రై చేసుకుంటాము ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. జీలకర్ర నీ కొద్దిగా వేయించి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసి ఫ్రై చేయండి జీడిపప్పు వేగాక ఇందులోకి ముప్పావు కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి.

ఈ ఉల్లిపాయలు వేగేలోపు ఒక బ్లెండర్ తీసుకోండి. అందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పుదీనా ఆకులు, పావు కప్పు దాకా కొత్తిమీర, అండ్ నానబెట్టుకున్న గసగసాలు జీడిపప్పు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న గ్రేవీ పేస్ట్ ని వేయించుకున్న ఉల్లిపాయల్లోకి వేసేసి ఆయిల్ పైకి తేలేంతవరకు కూడా చిన్న మంట మీద పెట్టి గరిటతో కలుపుతూ వేయించండి.

ఇలా నూనె పైకి తేలి గ్రేవీ పేస్ట్ అంతా కూడా చక్కగా వేగిపోయాక మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసాక ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో రెండు రెమ్మలు దాకా కరివేపాకు అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకుని వేసుకుని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటూ జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి సన్నగా తరిగి పెట్టుకున్నా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి కలిపేసుకుని పక్కకు దించేసుకోండి. అంతే గుమగుమలాడే సూపర్ టేస్టీగా ఉండే జూసీ జూసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది అండి.

Author

  • లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday

లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

Recent Posts

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

5 months ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

5 months ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

5 months ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

5 months ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

5 months ago

Google Pay – phonepe : కస్టమర్లకు పెద్ద షాక్ ఇవ్వబోతున్న గూగుల్ పే, ఫోన్ పే.. కొత్త పేమెంట్ సిస్టమ్ ఏంటో తెలుసా..?

Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…

5 months ago

This website uses cookies.