BRS : బీఆర్ ఎస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ ఎస్ నేతలపై అవినీతి ఆరోపణలు మంటలు రేపుతుంటే.. అటు ఢిల్లీ లిక్కర్ కేసులో ఏకంగా కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ కావడం పార్టీ ఇమేజ్ ను మొత్తం నాశనం చేస్తోంది. పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. దాంతో పాటు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలను కూడా బీఆర్ ఎస్ తిప్పికొట్టలేకపోతోంది. అదే పార్టీకి పెద్ద నష్టంగా మారిపోయింది. దానికి తోడు ఇప్పుడు బీఆర్ ఎస్ లీడర్లు అందరూ కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. బీఆర్ ఎస్ లో చాలా కాలంగా ఉన్న వారు కూడా వెళ్లిపోతున్నారు.
ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, టికెట్లు రాని వారు, ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే రేవంత్ ఆ మధ్య మాట్లాడుతూ.. మేము గేట్లు ఎత్తితే బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఆ పార్టీలో మిగిలేది నలుగురు మాత్రమే అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. ఆ ఎన్నికల తర్వాత బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఎంపీ ఎన్నికల ముందే ఈ తతంతం పూర్తి చేయాలని రేవంత్ భావిస్తున్నారంట.
అలా చేస్తే పార్టీలో ఫుల్ జోష్ వస్తుందని రేవంత్ భావిస్తున్నారు. చర్చంతా కాంగ్రెస్ మీదనే నడుస్తుంది కాబట్టి ప్రజల దృష్టి కూడా పార్టీ మీదనే ఉంటుందని అనుకుంటున్నారు. అందుకే ఎంపీ ఎన్నికలకు ముందే ఈ తతంతం పూర్తి చేయాలని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఒకే దెబ్బకు అటు బీఆర్ ఎస్ గ్రాఫ్ ను ప్రజల్లో తగ్గించొచ్చు అదేసమయంలో బీజేపీని కూడా బలహీనంగా మార్చవచ్చు అని రేవంత్ ఆలోచిస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ తో టచ్ లో ఉన్న తొమ్మిది మంది ఎమ్మెల్యేలను త్వరలోనే కాంగ్రెస్ లో చేర్చుకుంటారని అంటున్నారు రాజకీయ నాయకులు.
మిగతా వారిని ఎంపీ ఎన్నికల తర్వాత చేర్చుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. ఇలా మొత్తం బీఆర్ ఎస్ ను దెబ్బ కొట్టాలని రేవంత్ రెడ్డి పెద్ద ప్లానే వేస్తున్నట్టు చెబుతున్నారు. కాబట్టి త్వరలోనే బీఆర్ ఎస్ కు భారీ షాక్ తప్పదని అంటున్నారు రాజకీయ నేతలు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.