[njwa_button id="1872"]

[njwa_button id="1872"]
Categories: News

Ap Govt : అర్జెంటుగా 10 వేల కోట్లు కావాలి… ఆర్థిక ఒత్తిడిలో ఏపీ సర్కార్…!

Ap Govt : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా టీడీపీ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే విజయ అవకాశాల వరకు అంతా బాగానే ఉంది కానీ ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి గల ముఖ్య కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రస్తుతం అమలు చేయాల్సి ఉండడంతో పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారినట్టుగా తెలుస్తోంది. అంతేకాక ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల మొదటి రోజే జీతాలు ఇచ్చేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తుండడంతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా టైట్ గా మారినట్టు తెలుస్తున్నాయి.

దీనికి తోడు గత ప్రభుత్వం ఇష్టానుసారం చేసిన అప్పులు మరియు నిధుల సమీకరణ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి భారంగా మారిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే జులై 1 నాటికి ఏపీ ప్రభుత్వానికి సుమారు 10వేల కోట్లు అవసరమని తెలుస్తుంది. మరి ఇంత డబ్బును ఎలా సమీకరించాలి అనే దానిపై ప్రస్తుతం సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా పింఛన్లను జూలై 1న ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ ఒక్క పథకానికే దాదాపు 4408.31 అవసరమవుతారట. వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి రోజున జీతాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఆంధ్ర ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాలంటే ఏపీ సర్కార్ కి ప్రస్తుతం దాదాపు 10 వేల కోట్లు అవసరం అవుతాయి.

Advertisement
Ap Govt : అర్జెంటుగా 10 వేల కోట్లు కావాలి… ఆర్థిక ఒత్తిడిలో ఏపీ సర్కార్…!

ఇది ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఆర్ధిక సంవత్సరంలో తొలి 9 నెలలకు ప్రభుత్వాలు రుణ పరిమితి తీసుకునే విధంగా నిర్ణయిస్తారు. దీనిలో భాగంగానే 2024 ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలకు 47 వేల కోట్లు తీసుకునే వీలు ఉంటుంది. అయితే గత ప్రభుత్వం జగన్ సర్కార్ ఇప్పటికే దానిలో 25 వేల కోట్లను సమీకరించింది. అంటే ఇప్పుడు రాబోయే సెప్టెంబర్ వరకు మరో 22 వేల కోట్లు మాత్రమే తీసుకునే వీలుంటుంది. దీంతో ప్రస్తుతం ఈ సవాల్ చంద్రబాబుకు తీవ్ర తలనొప్పిగా మారింది. మరి దీనిని చంద్రబాబు సర్కార్ ఎలా ఎదుర్కొంటుందనేది వేచి చూడాలి.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి : కొత్త‌గా వ్యాపారం పెట్టుకునేవాళ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 25 ల‌క్ష‌ల లోన్‌, 35 శాతం సబ్సిడీ..!

Author

Latest Telugu News Desk

Recent Posts

Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!!

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…

10 months ago

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

2 years ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

2 years ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

2 years ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

2 years ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

2 years ago