Vishakapatnam : ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారం లో వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాలను అభివృద్ధి చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఐతే వైఎస్ జగన్ అయితే వైజాగ్ ని రాజధానిగా చేయాలని అనుకున్నారు. కానీ సీఎం చంద్రబాబు అమరావతిలో మళ్లీ రాజధాని పనులు మొదలు పెట్టారు. ఐతే వైజాగ్ అభివృద్ధిలో భాగంగా మెట్రో రైల్ ప్రాజెక్టుని తీసుకొస్తున్నారు. ఈమధ్యనే విశాఖపట్నంలో పర్యటించిన చంద్రబాబు ఈ సందర్భంగా డిజైన్ కి సంబందించిన విషయాల గురించి అధికారులతో చర్చించారని తెలుస్తుంది. అయితే మెట్రో రైల్ స్తంభాల చుట్టుకొలత పెంచడం కొన్ని అదనంగా నిర్మించడం తో పాటుగా బ్రిడ్జ్ పొడవు, వెడల్పుల విషయంలో కూడా మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది.
విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI 12 ఫ్లై ఓవర్లను నిర్మించబోతుంది. ఐతే ఈ ఫ్లై ఓవర్లు నిర్మించాక మళ్లీ మెట్రో వంతెనలు కట్టడం కన్నా రెండిటినీ కలిసి అందుకు తగినట్టుగ డిజైన్ చేసేలా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావుకి చంద్రబాబు సూచించారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో ఉన్న మెట్రో కార్యాలయాన్ని విశాఖకు తీసుకొచ్చారుఇ. 2017 లోనే వైజాగ్ మెట్రోకి ఫ్రీ బిడ్ వేస్తే దాదాపు ఐదు సంస్థలు ఇన్వెస్ట్ మెంట్ కి వచ్చాయి. ఐతే 2019 లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. వైసీపీ అధికారంలో అనకాపల్లి నుంచి భోగాపురం వరకు 140 కిలోమీటర్ల వరకు మెట్రో నిర్మించాలని డి.పి.ఆర్ సిద్ధం చేశారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 46 కిలోమీటర్ల వరకు మెట్రో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ వరకు రెండో విడత మెట్రోల్ ప్రాజెక్ట్ లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో అటు కొత్తగా ఫ్లై ఓవర్లు, మెట్రో రైల్ తో వైశాఖ దశ దిశ మారిపోయేలా ఉందని చెప్పొచ్చు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.