Allu Arjun : ఏపీ రాజకీయాలు మెగా, అల్లు కుటుంబాలు మధ్య కూడా చిచ్చు పెట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ఆ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని, బన్నీని మెగా ఫ్యామిలీ కాస్త దూరం పెట్టిందని నెట్టింట అనేక ప్రచారాలు సాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చేసిన పని అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఆయన మెగా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్‌కి మద్దతు చేస్తూ ఒక ట్వీట్ మాత్రమే వేయగా, పవన్‌కి వ్యతిరేఖ పార్టీకి చెందిన రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం నంద్యాల వెళ్లి ప్రచారం చేయడం ఇప్పుడు కాక రేపుతుంది. రవిచంద్ర తన స్నేహితుడు కాబట్టి అక్కడికి వెళ్లానని, తాను రాజకీయంగా ఏ పార్టీకి మద్దతు కాదని, తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని, స్నేహితుడికి ఇచ్చిన మాట కోసమే అక్కడికి వెళ్లినట్టు బన్నీ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చాడు.
అయితే బన్నీ చేసిన పని మెగా అభిమానులకి, మెగా కుటుంబానికి అస్సలు పడడం లేదు. ఈ విషయాన్ని వారు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మనసులో ఏది దాచుకోని నాగబాబు అయితే ఏకంగా ఇన్‌డైరెక్ట్ ట్వీట్ చేశాడు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే…! అని ఆ ట్వీట్ లో ఉంది.అల్లు అర్జున్ ను ఉద్దేశించే నాగబాబు ఆ ట్వీట్ చేశారని అందరికీ అర్థమైపోయింది. ఈ ట్వీట్ పై మెగా అభిమానులు మండిపడ్డారు. నాగబాబుకు నోటితొందర ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చిరంజీవి సీరియస్ అయి నాగబాబుకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ ఇంత జరుగుతుందని అస్సలు ఊహించలేదని, కేవలం స్నేహితుడికి సపోర్ట్ అందించడానికి మాత్రమే వెళ్లాడని కొందరు అంటున్నారు.
ఈ విషయంలో మెగాస్టార్ నాగబాబుని మందలించి సైలెంట్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ కాస్త అసహనం చూపించి, వదిలేయండని అన్నాడట. అయితే బన్నీ.. జనసేనకి, పవన్‌కి గతంలో చాలా సపోర్ట్‌గానే ఉన్నాడు. 2019లో అందరి కన్నా ముందు రెండు కోట్ల విరాళం ఇచ్చాడు. నాగబాబు కష్టాలలో ఉన్నప్పుడు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్రజెంటర్‌గా పేరు వేయించి కొంత సాయం దక్కేలా చేశారు. ఇక బన్నీకి సన్నిహితుడైన బన్నీ వాసుని జనసేన ప్రచారాలకి పంపారు. అయితే మధ్యలో వాసుని పవన్ దూరం పెట్టిన మళ్లీ పిలిచి అతనికి కీలక బాధ్యతలు అప్పగించారు. అంతా మంచిగా సాగుతున్న సమయంలో బన్నీ ఊహించని నిర్ణయం లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టినట్టు తెలుస్తుంది. అయితే అల్లు అరవింద్ ఈ సమస్యలని కూల్‌గా సాల్వ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడట.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.