Papaya Leaf : వర్షాకాలం వచ్చింది అంటే డెంగ్యూ ముప్పుని తెచ్చినట్లే. డెంగ్యూ వ్యాధి అంటేనే ఎంతో ప్రమాదకరం. అలాగే ఈ వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. దీనివల్ల ప్రాణాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఈ డెంగ్యూలో అతి ముఖ్యమైనది ఏమిటంటే ప్లేట్ లేట్స్ పడిపోవడం. ప్లేట్ లెట్స్ పడిపోతే తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. మరి దీని నుండి త్వరగా కోలుకోవడానికి బొప్పాయి ఆకు ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు. ఇది మనకి ప్రకృతి ఇచ్చిన గొప్ప ఔషధం. ఇది ఆహారం లో రుచితో పాటు డెంగ్యూ చికిత్సలకు సహాయపడుతుంది. మరి బొప్పాయి ఆకులు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఏ విధంగా ఉపయోగపడతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Papaya Leaf ప్లేట్ లెట్స్ ను పెంచుతుంది
డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్ లెట్స్ పడిపోవడం వంటివి జరుగుతాయి. దీనివల్ల శరీరం బలహీనంగా ఉంటుంది. బొప్పాయి ఆకు లో ఉండే పాపైన్ ఎంజైమ్స్ ప్లేట్ లెట్స్ ఏర్పరచడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు బొప్పాయి ఆకులు ఎంతో సహాయపడతాయి.
Papaya Leaf రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది.
బొప్పాయి ఆకులు విటమిన్ ఏ సి , ఇ వంటి పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. డెంగ్యూ వచ్చినప్పుడు శరీరం బలహీనంగా ఉంటుంది. దీని వలన సమస్య ఎక్కువ కావచ్చు.
జ్వరాన్ని తగ్గిస్తుంది.
బొప్పాయి ఆకులో యాంటీ పైరెటిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జ్వరం త్వరగా తగ్గడానికి ఉపయోగపడుతుంది. డెంగ్యూలో జ్వరం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ బొప్పాయి ఆకుని తీసుకోవడం ద్వారా త్వరగా జ్వరం తగ్గుతుంది.
నొప్పిని తగ్గిస్తుంది.
బొప్పాయి ఆకులో యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. తద్వారా ఇది శరీరంలోని వాపులను మరియు నొప్పులను తగ్గిస్తుంది. సాధారణంగా డెంగ్యూలో శరీరం వాపు , కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బొప్పాయి ఆకుని తీసుకోవడం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు.
బొప్పాయి ఆకులు ప్లేట్లెట్స్ ని ఎంత వేగంగా పెంచుతాయి.
బొప్పాయి ఆకు ఎంత త్వరగా పని చేస్తుంది అంటే అది రోగి యొక్క ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బొప్పాయి ఆకు తీసుకున్న 24 గంటల్లోనే ప్లేట్ లెట్స్ వేగంగా పెరుగుతాయని ఒక అధ్యయనం తెలిపింది.
బొప్పాయి ఆకుని ఎలా తీసుకోవాలి.
బొప్పాయి ఆకులను తినడం కంటే బొప్పాయి ఆకు జ్యూస్ తాగడం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. బొప్పాయి జ్యూస్ కోసం బొప్పాయి ఆకులను రెండు లేదా మూడు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకోవాలి. అందులో ఒక గ్లాస్ నీళ్లు , నిమ్మరసం లేదా తేనె కలుపుకొని దీనిని రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.
బొప్పాయి ఆకుల టీ.
బొప్పాయి ఆకుతో టీ కూడా తాగవచ్చు. బొప్పాయి ఆకు టీ కోసం రెండు లేదా మూడు బొప్పాయి ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి నీటిలో వేసుకొని ఉడికించుకోవాలి. దానిని వడగట్టుకుని తాగడమే. దీని ద్వారా మీరు ప్లేట్ లెట్స్ ను వేగంగా పెంచుకోవచ్చు.