Sleeping : నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా… అయితే ఈ చిట్కాలు తప్పక పాటించండి…@

Sleeping : నేటి బిజీ లైఫ్ లో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. భవిష్యత్తుపై ఆందోళనలు, విపరీతమైన ఆలోచనలు, ఆరోగ్య సమస్యలు, వయసుకు మించిన బాధ్యతల ఒత్తిడి , మొదలైన సమస్యల కారణంగా చాలామంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటివారు రోజు తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ప్రశాంతంగా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతిరోజు చేయడం వలన నిద్రలేమి సమస్య నుంచి బయటపడి మరుసటి రోజు తాజాగా మేల్కొనవచట. మరి అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Sleeping : నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా... అయితే ఈ చిట్కాలు తప్పక పాటించండి...@
Sleeping : నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా… అయితే ఈ చిట్కాలు తప్పక పాటించండి…@

నిద్రలేమి సమస్య ప్రతిరోజు ఉన్నట్లయితే అది రోగ నిరోధ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వలన అనేక రోగాలు , ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాగే నిద్ర లేకపోవడం వలన ముఖ్యంగా దృష్టిలోపం సమస్య ఇబ్బంది పెడుతుంది. కళ్ళు పొడిబారడం, కంటినొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. అదేవిధంగా నిద్రలేమి సమస్యలో మరొకటి అధిక ఆకలి. సాధారణంగా మీరు రోజు తినే దానికంటే ఎక్కువగా తిన్నట్లయితే తప్పక జాగ్రత్తగా వహించాలి. అలాగే సరైన నిద్రలేని వారు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక ఒత్తిడి కారణంగా కూడా నిద్రలేమి సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

నిద్ర లేకపోవడం వలన అనేక సమస్యలు వస్తాయని మీకు తెలుసా… నిద్ర లేకపోవడం వలన ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రేలిన్ ని ఎక్కువగా విడుదల చేయడం వలన ఆకలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే లెఫ్టిన్ అనే హార్మోన్ తక్కువగా విడుదల కావడం వలన కడుపు నిండింది అనే భావన కల్పిస్తుంది. దీనివలన ఆహారం ఎక్కువగా తినేలా చేస్తుంది. అది ఉబ్బకాయానికి దారి తీస్తుంది. నిద్ర లేకపోవడం వలన మలబద్ధకం చిరాకు , డిప్రెషన్ కోపం వంటివి వస్తాయి. దీని ప్రభావం ఎనిమీయాకు దారితీస్తుంది.అలా ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నిద్రలేమి సమస్యకు వాకింగ్ , యోగ, సైకిలింగ్ వంటివి చేయాలి. వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా ఇలాంటివారు సిగరెట్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. మంచి నిద్ర మనిషికి ఎంతో అవసరం. నిద్ర అనేది శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

నిద్రలేమి సమస్య నుండి బయటపడడం కోసం రాత్రి పడుకునే రెండు మూడు గంటలు ముందే భోజనం చేయాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. ఆహారం తీసుకున్న రెండు మూడు గంటల తర్వాత పడుకోవాలి. ఇలా ప్రతిరోజు చేయడం ద్వారా మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మరియు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అలాగే హైడ్రేట్ గా ఉండడం కూడా చాలా ముఖ్యం. దానికోసం మీరు పగటిపూట నీళ్లను ఎక్కువగా తీసుకోవడం ద్వారా హైడ్రేడ్ గా ఉంటారు. ఒకవేళ నిద్ర రాని వారు రాత్రి నిద్రించే ముందు వలేరియల్ ఫ్రూట్ తో చేసిన హెర్బల్ టీ ని తాగడం వలన త్వరగా నిద్ర పడుతుంది. లేదా గోరువెచ్చని పాలని తాగడం కూడా మంచి పరిష్కారం.

Author