Mahesh Babu Rajamouli : మహేశ్, రాజమౌళి సినిమా పట్టాలెక్కేది అప్పుడేనా? షూటింగ్ స్టార్ట్ కాకపోవడానికి కారణం అదేనా?

Mahesh Babu Rajamouli : ప్రపంచమంతా ఇప్పుడు ఆ సినిమా కోసమే ఎదురు చూస్తోంది. అదే మహేశ్ బాబు, రాజమౌళి సినిమా గురించి. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని షూటింగ్ కోసం ఎదురు చూస్తోంది. నిజానికి.. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. 2022 లోనే ఈ మూవీ రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజమౌళి సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్, స్టోరీ డెవలప్ మెంట్ తప్పితే ఆ సినిమా పేరు, అసలు కథ ఏంటి.. హీరోయిన్, ఇతర కాస్ట్ వివరాలేవీ తెలియదు.

when Mahesh babu and Rajamouli movie shooting will start

అయితే.. కొన్ని రోజుల ముందే ఈ మూవీ పట్టాలెక్కేందుకు ప్రయత్నాలు జరిగినా ఇప్పుడు ఈ నెలలో మాత్రం సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవు. ఈ సినిమా కోసం మహేశ్ బాబు కూడా ప్రత్యేకంగా ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు. ఆయన లుక్ కూడా మారింది. హాలీవుడ్ హీరోలా మహేశ్ ను తీర్చిదిద్దారు మేకర్స్.

Mahesh Babu Rajamouli : ఆషాఢ మాసం ఎఫెక్టేనా?

అయితే.. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకపోవడానికి అసలు కారణం ఆషాఢ మాసం అట. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తున్న విషయం తెలిసిందే. జులై 21 వరకు కూడా ఆషాఢ మాసం నడవనుంది. ఆషాఢ మాసం అంటేనే చాలామంది ఏ పనులు ప్రారంభించరు. శుభకార్యాలు కూడా నిర్వహించరు. అందుకే.. ఆషాఢ మాసం పూర్తయ్యాకే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే తన కొత్త సినిమా ముహూర్తాన్ని కూడా ఆషాఢ మాసం పూర్తయ్యాక ప్రారంభించాలని జక్కన్న భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాకు ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబీ29 పేరుతో వర్కింగ్ టైటిల్ మాత్రమే పెట్టారు. ఈ సినిమాలో ఎక్కువమంది ఇంటర్నేషనల్ స్టార్స్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఒక అడ్వెంచర్ త్రిల్లర్. ఫారెస్ట్ నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమా. ఈ సినిమాలో ఇండోనేషియాకు చెందిన హీరోయిన్ ఇస్లెన్ మహేశ్ కు జోడీగా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Author