Ramya Krishna : వేసవికాలం అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది మామిడిపండు. ఎందుకంటే మామిడిపండు కేవలం వేసవికాలంలో మాత్రమే దొరికింది. అందుకే దీనిని సీజనల్ ఫ్రూట్ గా పిలుస్తారు. అయితే వేసవికాలంలో మామిడి పండ్లకు ఎంత డిమాండ్ ఉంటుందో మామిడికాయలతో చేసే ఆవకాయ పచ్చడి కి కూడా అంతే డిమాండ్ ఉంటుంది. ఇక ఈ వేసవికాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో మామిడి పండ్లతో పాటు ఆవకాయ కూడా తప్పనిసరిగా ఉంటుంది.
ఇక ఈ ఆవకాయ పచ్చడి అంటే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు విపరీతమైన ఇష్టం. అందుకే అమ్మ ఆవకాయ ఎప్పటికీ బోర్ కొట్టవు అంటూ పలు సందర్భాలలో సామెతలు కూడా వేస్తుంటారు. అయితే సామాన్యులు ఆవకాయ పచ్చడి చేయడం అనేది సర్వసాధారణమే. కానీ సినీ సెలబ్రిటీలు సైతం ఈ ఆవకాయ పచ్చడిని ఆరగించడానికి స్వయంగా వారి చేతులతో తయారు చేసుకుంటే ఆశ్చర్యమనే చెప్పాలి కదా…అవును మీరు వింటున్నది నిజమే.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు బాహుబలి సినిమాతో శివగామిగా పేరుపొందిన రమ్యకృష్ణ ఆవకాయ పెడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సాధారణ ప్రజల నుండి సినీ సెలబ్రిటీల వరకు ఆవకాయ అంటే నచ్చిన వారు ఎవరు ఉండరు. అందుకే ఆవకాయ పచ్చడిని సొంతంగా తయారు చేసుకోవాలని చాలామంది భావిస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన చేతులతో ఆవకాయ పచ్చడి పెడుతున్న వీడియోను రమ్యకృష్ణ షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో రమ్యకృష్ణ గుంటూరు కారం తో ఘాటైన పచ్చడి పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనికోసం ముందుగా రమ్యకృష్ణ మామిడికాయ ముక్కలను తీసుకుని దానికి కావాల్సిన కారం ఉప్పు మసాలాలు ఒక దాంట్లో కలుపుకొని తర్వాత కొద్దిగా నూనె పోసి పచ్చడి తయారు చేసింది.
ఇక ఈ పచ్చడిని చూస్తుంటే ఎవరికైనా సరే నోరు ఊరాల్సిందే. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఎంతటి సెలబ్రిటీలు అయినా సరే ఆవకాయ ముందు దాసోహం అనాల్సిందే అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.