Pawan Kalyan : జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ తన పార్టీని గెలుపు రథం ఎక్కించడానికి పదేండ్ల నుంచి ఎన్ని కష్టాలు పడ్డాడో మనం చూశాం. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోర పరాజయం చూసినా కానీ.. వెనకడుకు వేయకుండా ఈ సారి గెలవాలన్ని కసితో ముందుకెళ్లాడు. ఆ కసే తనను, తన పార్టీని అఖండ విజయం సాధించేలా చేశాయి. 100శాతం స్ట్రైక్ రేటు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎం బాధ్యతలు దక్కాయి. బాధ్యతలు చేపట్టి కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆయన సంతకం చేసిన పెన్ను గురించి చర్చకు దారితీసింది. ఇటీవల పవన్ వదిన సురేఖ ఖరీదైన పెన్ను బహుమతిగా అందజేశారు. ఓ అభిమాని కూడా పెన్ను గిప్ట్‌గా ఇచ్చారు. దీంతో ఆయన ఏ పెన్ను వాడారు..? ఏ పెన్నుతో అధికారిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది.
వదిన సురేఖ ఎంతో ప్రేమతో ఇచ్చిన రూ.3.50 లక్షల విలువైన మాంట్ బ్లాంక్ వాల్ట్ డిస్నీ పెన్‌ను పక్కనపెట్టి… ఓ సాధారణ పెన్నుతో పవన్ తన తొలి సంతకం చేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్.. తొలిసారి కొన్ని ముఖ్యమైన దస్త్రాలపై సంతకాలు చేశారు. అయితే, ఆ సమయంలో పవన్ కల్యాణ్ సంతకం చేసిన పెన్ను గురించి అనేక విధాలుగా చర్చ జరిగింది. వదిన ఇచ్చిన ఖరీదైన పెన్నుతో పవన్ కల్యాణ్ తొలిసంతకం చేశారని అంతా అనుకున్నారు. అయితే, పవన్ మాత్రం.. ఓ సాధారణ అభిమాని బహూకరించిన పెన్నుతో డిప్యూటీ సీఎంగా తొలి సంతకం చేశారు.
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే ముందు రోజు మంగళగిరి నుంచి అమరావతికి ర్యాలీగా చేరుకున్నారు. ఈ క్రమంలో అమరావతి రైతులు ఆయనకు అడుగడుగునా సాదర స్వాగతం పలికారు. రోడ్డంతా పూలు పరిచి పవన్‌పై తమ ప్రేమ చాటారు. ఆ సమయంలో జనంలో నుంచి ఓ అభిమాని పవన్ కల్యాణ్‌కు పెన్ను అందించాడు. ఆ పెన్నును జాగ్రత్తగా తీసుకొని… జేబులో పెట్టుకున్నారు పవన్. ఆ పెన్ను విలువ పది రూపాయలే అయినా… పవన్ కల్యాణ్ మాత్రం ఎంతో విలువ ఇచ్చారు. వదిన ఇచ్చిన రూ.3.50 లక్షల విలువైన స్పెషల్ ఎడిషన్ పెన్నును కాదని అభిమాని ఇచ్చిన సాధారణ రూ.10 పెన్నుతో తొలి సంతకం చేయడం అభిమానుల మనసు చూరగొంది. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజు కూడా పవన్ కల్యాణ్ అభిమాని ఇచ్చిన పెన్నుతో కనిపించారు. అసెంబ్లీలో అదే పెన్నుతో సంతకం చేశారు. ఇది అభిమానులకు పవన్ కల్యాణ్ ఇచ్చే విలువ అంటూ ఆయన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.