Renu Desai : సినీ నటుడు, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తాను రెండో పెళ్లి చేసుకుంటానని సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ బద్రి సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సహజీవనం చేసి వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందు వీరికి కుమారుడు అకీరా నందన్, తర్వాత కుమార్తె ఆద్య జన్మించారు. అనుకోని కారణాల నేపథ్యంలో వారు రెండు సంవత్సరాలకే విడిపోయారు. అప్పటి నుంచి రేణు దేశాయ్ ఒంటరిగానే ఉన్నారు. కొంత కాలం తర్వాత ఆమె మరో వివాహానికి సిద్ధమై, ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేసుకుంది.
కానీ ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాత ఎందుకో తెలియదు కానీ ఎంగేజ్‌మెంట్‌ని రద్దు చేసుకున్నారు రేణు దేశాయ్. ఒంటరిగానే ఉంటూ తన పిల్లల బాగోగులు దగ్గరుండి చూసుకుంటుంది. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తుండటంతో పాటు పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించారు. ఓ మూవీని సైతం డైరెక్ట్ చేశారు రేణు దేశాయ్. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్ తనకు సంబంధించిన చాలా విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై కీలక వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్.. రెండో మ్యారేజ్ పై స్పందించారు. తాను కచ్చితంగా రెండో వివాహం చేసుకుంటానని వెల్లడించారు. మరో రెండు మూడేళ్లలో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు ఎందుకు రెండో మ్యారేజ్ చేసుకోలేదో బయటపెట్టింది.
అప్పట్లో రెండో పెళ్లికి సిద్ధమై, మళ్లీ నిశ్చితార్థం రద్దు చేసుకోవడానికి కారణం తన పిల్లలే అని చెప్పింది. వారు చిన్నగా ఉండడంతో కేర్ కావాల్సిన అవసరం ఉందని, తాను పెళ్లి చేసుకుంటే వారికి సమయాన్ని కేటాయించలేననే భయంతో మ్యారేజ్ చేసుకోలేదని చెప్పింది రేణు దేశాయ్. మరో రెండు మూడేళ్లలో పిల్లలు పెద్ద అవుతారు కాబట్టి కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పిల్లలు కూడా తన వివాహం పట్ల సుముఖత చూపారని రేణు దేశాయ్ తెలిపారు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.