Naga Babu : ఏపీ ఎన్నికలు మెగా కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్లగా, అల్లు అర్జున్ మాత్రం కేవలం ట్వీట్‌తో సరిపెట్టాడు. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ నంధ్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వెళ్లి అక్కడ ప్రజలని తన స్నేహితుడికి ఓటు వేయాల్సిందిగా అడిగారు. అల్లు అర్జున్ నంధ్యాల పర్యటన వివాదం ఇప్పుడు రచ్చగా మారింది. ఓ వైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్.. కూటమి తరఫున పోటీ చేస్తున్న ఈ సమయంలో శిల్ప మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించడానికి బన్నీ నంద్యాల వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
మెగా ఫ్యామిలీతో ఉన్న వైరం కారణంగానే బన్నీ ఈ స్టెప్ తీసుకున్నారనే టాక్ నడిచింది ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఈ పర్యటన చేసినందుకు, అక్కడ అల్లు అర్జున్ ని చూడటానికి వందలాది మంది ప్రజలు వచినందువలన శాంతి భద్రతలకి కూడా ఆటంకం కలిగింది. ఈ విషయంలో బన్నీపై కేసు కూడా నమోదైంది. అయితే ఈ పర్యటనపై అల్లు అర్జున్, తను హైదరాబాదులో ఓటు వేసే సమయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే ఇక్కడ ఒకటి అల్లు అర్జున్ తెలుసుకోవాలి అని మెగా అభిమానులు అంటున్నారు. శిల్పా రవి ఎంతటి స్నేహితుడైనా, పవన్ కళ్యాణ్ దగ్గరి బంధువు కాబట్టి ముందు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఉండాల్సింది అని అంటున్నారు.
మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఓ ట్వీట్ చేసి హీటు పెంచారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…! అంటూ సంచలన ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఇది పరోక్షంగా అల్లు అర్జున్‌కి కౌంటరే అని అంటున్నారు. ఇది మరోసారి అల్లు- మెగా ఫ్యామిలీస్ మధ్య వార్ అనేది తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఇష్యూ తీవ్ర దుమారం రేపింది. మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఆర్మీ నడుమ కామెంట్స్ వార్ నడుస్తోంది. కాగా.. సరిగ్గా ఎన్నికల ప్రచారం చివరి రోజున అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం, మద్దతు తెలపడం రాజకీయంగా వేడి పెంచింది. తాజాగా దీనిపై పరోక్షంగా నాగబాబు కౌంటర్ వేయడం చూస్తుంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ రెండుగా విడిపోయిందనే సంకేతాలు వస్తున్నాయి.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.