Meena : చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మీనా ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అలనాటి స్టార్ హీరోల సరసన నటించి ఎంతో మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక దృశ్యం సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మీనా.. తెలుగు, తమిళ్ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. తన భర్త చనిపోయిన తర్వాత మీనా రెండో పెళ్లి చేసుకోబుతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఆ వార్తలని పలుమార్లు ఖండించింది మీనా.తెలుగు, తమిళ ఇండస్ట్రీలను ఏలిన మీనా . ఇటు తెలుగు సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తమిళంలో రజినీకాంత్ నటించిన ఓ సినిమాలో బాలనటిగా నటించింది మీన. ఈ సినిమాలో తండ్రి పాత్ర కాకపోయినా.. అనాధ శరణాలయంలో అనాథగా ఉన్న మీనాను రజనీకాంత్ తండ్రిలా చూసుకుంటాడు. వీరిద్దరి బంధమే సినిమాకు బలం. ఆ సినిమాలో తండ్రీ కూతురుగా మెప్పించారు ఇద్దరు.
ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా, అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఇలా తెలుగు, తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచింది.2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌తో మీనా వివాహం అయింది. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది.
తేరీ సినిమాలో నైనిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతూ 2022 జూన్ 28న రాత్రి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో మీనా భర్త తుది శ్వాస విడిచారు. ఇక అప్పటి నుండి సింగిల్‌గానే ఉంటుంది మీనా.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మీనా అప్పుడప్పుడు తనకి సంబంధించిన ఫొటోలని షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. కేక పెట్టించే అందాలతో కుర్రకారుకి మైకం తెప్పిస్తుంటుంది. తాజాగా మీనా పిక్స్ చూసిన వారు ఏమందంరా ఇది అంటున్నారు. మీనా అందం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తరగడం లేదు. ఆమె అందానికి దాసోహం కావల్సిందే. మీనా అందాన్ని వర్ణించడం కూడా తగదు అంటున్నారు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.