Suswara Music Academy : నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గల డల్లాస్ నగరంలో డాక్టర్ మీనాక్షి అనుపిండి అనే పేరు పొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే ఈమె దాదాపు 21 సంవత్సరాల నుండి సుస్వర మ్యూజిక్ అకాడమీ పేరిట ప్రతి ఏడాది వార్షికోత్సవ సంబరాలను చాలా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల మే 5వ తేదీన ఆదివారం రోజు డల్లాస్ మహానగరంలోని గ్రాండ్ సెంటర్ అనే ఆడిటోరియంలో సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అయితే ఈ ఉత్సవానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అతిథులుగా హాజరయ్యారు. దీనిలో ప్రముఖంగా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ శ్రీ ప్రసాద్ తోటకూర గారు, డల్లాస్ లోని ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులుగా ముఖ్యపాత్ర వహిస్తున్న శ్రీ గోపాల్ గారు , అలాగే ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కిషోర్ కంచర్ల , శ్రీమతి శారద సింగిరెడ్డి , శ్రీ ప్రకాష్ రావు గారు , ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి ప్రముఖ సినీ గేయ రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత శ్రీ చంద్ర బోస్ గారు విచ్చేశారు. వారితోపాటు ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పీ పట్నాయక్ , టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య పలువురు సినీ ప్రముఖులు పాల్గొనడం జరిగింది.
ఇక ఈ వార్షిక సంబరాలలో మీనాక్షి అను పిండి గారు తన శిష్య బృందంతో కలిసి దాదాపు 7 సిగ్మెంట్లలో 35 కు పైగా సాంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శించారు. దాదాపు 10 గంటలపాటు విరామం లేకుండా సాగిన ఈ సాంస్కృతిక ప్రదర్శనలు అక్కడికి వచ్చిన ప్రేక్షకులందరినీ కుర్చీలకు కట్టిపడేలా చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ వార్షిక సంబరాల వేదికపై తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన గేయ రచయిత ఆస్కార్డ్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారికి సుస్వర సాహిత్య కళానిధి బిరుదును సత్కరించడం జరిగింది. అంతేకాక చంద్రబోస్ గారు తన స్వగ్రామం అయినటువంటి చల్లగలిగే లో చేపట్టిన ఆస్కార్ గ్రంథాలయ నిర్మాణానికి ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 15 డాలర్స్ విరాళం రావడం విశేషం. ఇది ఇలా ఉండగా ఈ వార్షిక సంబరంలో ఆర్.పీ పట్నాయక్ గారు తన పాటలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు సుస్వర నాదనిది అనే బిరుదును సత్కరించారు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.