Vaishakha Purnima : మే 23న వైశాఖ పౌర్ణమి రోజున రాత్రి వరకైనా ఆడవాళ్లు ఈ రంగు గాజులు వేసుకుంటే భర్తకు అపారంగా కలిసి వస్తుంది. అంతేకాదు ఆడవాళ్లు ఈ రంగు గాజులు వేసుకుంటే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. మరి వైశాఖ పౌర్ణమి రోజు ఏమి చేయాలి ఎలాంటి గాజులు ధరించాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.. చంద్రుడు వైశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖమాసం అని అంటారు. మాసాలలో వైశాఖం రెండో మాసం కావటం, అందులోనూ ఉత్తరాయణంలో ఉండటం వలన అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. మన సనతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు. వైశాఖ పౌర్ణమి రోజున కచ్చితంగా ఆచరించాల్సిన రీతిలో సముద్ర స్నానం ఒకటి. ఈరోజు కరక్కాయను తీసుకువెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించటం వలన నరగోషా, నరదృష్టి అనేవి తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి.
జ్ఞాన పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, స్త్రీ పూర్వ జయంతి, అన్నమాచార్య జయంతి ఇన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. ఈ వైశాఖ పౌర్ణమి రోజు సిద్ధార్థుడు జన్మించటం, అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారటం వలన ఇది బుద్ధ పౌర్ణమి అయింది అని అత్యాధిమిక సాధకులకు జ్ఞాన ప్రాప్తి పొందే వారికి సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని పంచాంగ కర్తలు చెబుతున్నారు. ఈ వైశాఖ మాసంలో కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూ మండలాన్ని రక్షించిన రోజుగా కూర్మ పురాణం తెలియజేస్తుంది. అన్నమాచార్య వారు వైశాఖ మాసం రోజు జన్మించటం వలన ఆయన చేసిన ఆధ్యాత్మి కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువును ఆరాధించి, పూజించటం తో పాటు సంపత్ గౌరీ వ్రతాన్ని ఆచరించటం విశేషం.
ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. సంపదలు కలగాలనే కోరికతో ప్రతి మహిళ పసుపుతో గౌరీ దేవిని పూజించి ఆ పసుపు గౌరు దేవి ముత్తైదుకు వాయినం ఇవ్వటం ఈ వ్రతం యొక్క విశేషం. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం గౌరీదేవిని పూజించటం, సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం, అన్నమాచార్య, బుద్ధుడిని, కూర్మావతారం లో ఉన్న మహావిష్ణువును పూజించటం విశేషం.. వైశాఖ పౌర్ణమి రోజు చేసే దాన ధర్మాల వలన అనేక శుభ ఫలితాలు ఉన్నాయి అని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ రోజున ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం, పేదవారికి వస్త్రధారణ, గొడుగు, మరియు చెప్పులు నీటి కుండ దానం చేయడం వలన పుణ్యఫలం అనేది దక్కుతుంది. అలాగే గంగలో స్నానం ఆచరించిన పుణ్యం అనేది లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో ఉన్న తులసి కోటను శుభ్రం చేసుకొని పూజించటం వలన గొప్ప పుణ్యం అనేది కలుగుతుంది అని పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు. అలాగే వైశాఖ పౌర్ణమి రోజున మహిళలు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగు గాజులు ధరిస్తే ఆ ఇంట్లో అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మహిళలు ఈ గాజులు ధరించడం వలన ఆ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి అని భర్త సంపద పెరుగుతుందని చెబుతున్నారు. అయితే మహిళలు పొరపాటున కూడా పగిలిన గాజులు ధరించకూడదు. ఆకుపచ్చ,ఎరుపు,పసుపు రంగు గాజులను ధరిస్తే లక్ష్మి అనుగ్రహం కలిగి కోటీశ్వరులు అవుతారు..
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.