Mithuna Rasi : మిధున రాశి వీరి జన్మ నక్షత్రం మృగ మూడు నాలుగు పాదాలు లేదా 6 రుద్ర ఒకటి రెండు మూడు నాలుగులో జన్మించిన వారిది మిధున రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుంది..? అలాగే ఎలాంటి లాభనష్టాలు చేకూరుతాయో..? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.మిధున రాశి వారికి ఆగస్టు నెలలో అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే అనుకున్న ఫలితాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆశించిన భాగ్యం చేతికి వస్తుంది. విద్యార్థులు విజయాలను సాధిస్తారు. అలాగే ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. నూతన బాధ్యతల వలన గౌరవం హోదా పెరుగుతాయి. వివాహ మరియు సంతాన ప్రయత్నాలకు ఈ మాసం అనువైనది. ఈ నెలలో ధన సంబంధమైన చికాకులు తొలగుతాయి. అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వీరు పని చేసే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
మంచి ఫలితాలను పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. నూతన కాంట్రాక్టులు ఏర్పడతాయి. మిధున రాశి వారికి ఈ నెల రెండో వారంలో సామాన్యంగా ఉంటుంది. మూడవారంలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సుఖ సంతోషాలు నెలకొంటాయి. స్త్రీలకు వారసత్వ సంబంధ లాభాలు లభిస్తాయి. వ్యాపారస్తులు మంచి ఫలితాలను పొందుతారు. విదేశీయాలలో వ్యాపారం చేయాలి అనుకునే వారికి విజయం సాధించే అవకాశం ఉంది. అయితే చివర్లో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. వీరి జీవితంలో జరిగే చిన్న చిన్న సమస్యల నుంచి బయటప డగలుగుతారు. ఆదాయానికి సంబంధించిన కొన్ని పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆశించిన స్థాయిలో ఆదాయం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందు వినోదాల లో పాల్గొంటారు. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది.
కాకులకు బెల్లం తో చేసిన రొట్టెలను వేయండి. పస్ పక్షాలకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. దీని ద్వారా శుభం కలుగుతుంది. అలాగే శుక్రవారం నాడు శ్రీ సూక్తం పాటించండి. ఈ రాశి వారి విష్ణుమూర్తిని పూజించాలి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామాన్ని పటించాలి. ప్రతికూల ప్రభావాలు తగ్గించుకునేందుకు పది ముఖాల రుద్రాక్షను ధరించాలి. బుధవారం రోజు పచ్చటి వస్త్రాలు ధరించి విష్ణుమూర్తిని పూజించాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించాలి. పేద బ్రాహ్మణులకు విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలి. వృద్ధ బ్రాహ్మణులకు చేయూతను అందించాలి. శ్రీ దత్తాత్రేయ ఆరాధన చేయాలి.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.