Mesha Rasi : ఆగస్టు నెలలో అశ్వినీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారిది మేషరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆగష్టు నెల చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థికపరంగా ఈనెల అనుకూలంగా ఉంటుంది. వీరు ఏదైనా వివాదం వలన కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. ప్రేమ సంబంధిత విషయాలు ఈనెల బాగానే ఉంటుంది. అయితే మీ భాగస్వామి నుంచి కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంది. గృహంలో కోరుకున్న విధంగా గృహ నిర్మాణ పరమైన మార్పులు చేస్తారు. నూతన వస్తువులను కొంటారు. సోదరి వర్గంతో వివాదాలు మినహా గృహ సంతోషాలు సంపూర్ణంగా లభిస్తాయి. తలపెట్టిన ప్రతి పని నిదానంగా పూర్తవుతుంది. మేష రాశి వారికి ఈనెల ప్రారంభం బాగుంటుంది. వీరు నెల మధ్యలో కెరియర్ పరంగా విజయాలను పొందవచ్చు.
ఉద్యోగాలు మారాలి అనుకున్న వారికి మరియు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. వారు తమ ప్రయత్నాలు ద్వారా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. వీరు కోరుకున్న స్థలంలో ఉద్యోగం పొందవచ్చు. ఇక ఆదాయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ నెల గడిచిపోతుంది. సిరాస్తులను సమకూర్చుకోవడంలో సఫలం అవుతారు. వారసత్వ ఆస్తులు కొన్ని లభించవచ్చు. మేషరాశి స్త్రీలకు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. సానుకూల మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగం కోసం చూస్తున్న వారి ప్రయత్నాలు సానుకూల పడతాయి. వృత్తి వ్యాపారాల లో లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులు ఆశించిన సత్ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారు ఈ నెలలో శుభవార్తలను వింటారు. వ్యాపార పరంగా చూస్తే వ్యాపారస్తులు ఈ నెలలో అప్రమత్తంగా ఉండాలి.
ఏ పని చేసిన పూర్తి అంకిత భావంతో చేయాలి. వ్యాపారంలో కొన్ని సవాలు ఎదురవుతాయి. బెట్టింగులకు దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్థికపరంగా చూసుకుంటే ఈ నెల రెండు బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో కలిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. కొందరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. కొంతమంది స్నేహితులు బంధువులు డబ్బు విషయంలో ఇరకటం పెట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలోని వారితో సంబంధాలను కొనసాగించాలి.
మేషరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది. ఆదిత్యవృతను చేయాలి. శనివారం పేదవారికి సహాయం చేయాలి. అలాగే గురువులను గౌరవించాలి. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించవచ్చు. అలాగే శుభ ఫలితాల కోసం గోమాత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పసుపక్షాలకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మంగళవారం రోజు విఘ్నేశ్వరుని, సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.